అగ్రవర్ణాలపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫైర్, అంతరం సరికాదంటూ, చదువుకున్నవారిపై కూడా..

మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కులం పేరును బట్టి బలుపు ఉంటుందని హాట్ కామెంట్స్ చేశారు. క్రిస్మస్ దుస్తుల పంపిణీలో అయ్యప్పమాల వేసుకొని ఎమ్మెల్యే సంచలన కామెంట్లు చేశారు. అగ్రవర్ణాల గురించి ఎమ్మెల్యే కామెంట్లపై ఆయా వర్గాల నేతల నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది.

కేసముద్రంలో సోమవారం క్రిస్మస్ దుస్తులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రెడ్డి, వెలమ కులస్తులకు బలుపు ఉంటుందన అన్నారు. చిన్న కులాల వారిని వారు కించపరుస్తారని కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. మనుషులకు మూడురకాల బలుపు ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు. రెడ్డి, వెలమ కులాలకు చెందిన అగ్రకులమని ఫీలవుతారని చెప్పారు. రెండోది డబ్బున్నవారు బీరాలకుపోతారని తెలిపారు. చదువుకున్నవారు కూడా బలుపు చూపిస్తారని వారిని కూడా వదల్లేదు ఎమ్మెల్యే.

mla shankar naik angry on higher castes..

మనుషులకు ఇలా వివక్ష ఉండటం సరికాదన్నారు. ఎవరికైనా ఉండేది రక్తమే కదా.. అలాంటప్పుడు వివక్ష ఎందుకు అని ప్రశ్నించారు. అందరు తినేది అన్నమే, గాలి, నీరు ఒకటే తీసుకుంటారు కదా అని ప్రశ్నించారు. అయితే మిగతా కులాలను ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఇలా కుల వివక్ష చూపించడం సరికాదన్నారు. అంతరాలను దూరం పెట్టి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+