Hyderabad: హైదరాబాదీలకు శుభవార్త.. కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవర్ పార్కింగ్..
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ కు ఉన్నవారే కాకుండా హైదరాబాద్ వచ్చిపోయే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పలు సరైన పార్కింగ్ లేక.. వాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద భారీ ట్రాఫిక్ కేబీఆర్ పార్క్ ముందు భారీగా వాహనాలు నిలిచిపోతాయి. దీంతో అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవర్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందు కోసం నవ నిర్మాణ్ అసోసియేట్స్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఒకే చెప్పింది. జూబ్లీహిల్స్‌లోని KBR పార్క్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించాలని ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ తో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ పార్కింగ్ ఏరియాను 405 చదరపు మీటర్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కింగ్ స్థలంలో 72 కార్లను పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్ ప్రాంతంలో కార్ స్పేస్‌లను ఉంటాయి. కేబీఆర్ పార్క్ వద్ద ఏర్పాటు చేయబోయే పార్కింగ్ స్థలంలో 20 శాతం టూ వీలర్లకు కేటాయించనున్నారు. ఈ మల్టీ లెవల్ పార్కింగ్ డీబీఎఫ్ఓటీ పద్ధతిలో నిర్మించనున్నారు. అయితే పార్కింగ్ కోసం డబ్బులు వసూలు చేయనున్నారు. పార్కింగ్ చేసినప్పుడు మెషీన్లతో టికెట్లు ఇస్తారు.
పార్కింగ్ సదుపాయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనుంది. పార్కింగ్ ను ముందుగానే బుక్ చేసుకునేందుకు మొబైల్ యాప్ ఇవ్వనున్నారు. దీంతో నావిగేట్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ మల్టీ లెవల్ పార్కింగ్ ను హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటుచేయాలని డిమాండ్లు వస్తున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications