దుమ్ము లేపే డ్యాన్స్ షో.. ముంబై కుర్రాళ్లు అమెరికాలో ఇరగదీశారుగా (వీడియో)

హైదరాబాద్ : ముంబై కుర్రాళ్లు అమెరికాలో శభాష్ అనిపించుకున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో కీపిటప్ అనిపించుకున్నారు. ఔరా అనిపించేలా అద్భుతమైన డ్యాన్ పర్‌ఫార్మెన్స్ చేశారు. ప్రదర్శన జరుగుతున్నంత సేపు వీక్షకుల కేరింతలతో వేదిక ప్రాంగణం మార్మోగిపోయింది.

ముంబైకి చెందిన డ్యాన్స్ గ్రూప్ 'వీ అన్‌బీటబుల్' సభ్యులు అమెరికా వేదికపై అద్భుత ప్రదర్శన ఇచ్చారు. అమెరికాస్ గాట్ టాలెంట్ షో లో దుమ్ము లేపారు. వారి అద్భుతమైన ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక జడ్జీలు సైతం వావ్ అంటూ ఫిదా అయిపోయారు. ఆ డ్యాన్స్ గ్రూపులోని ఓ సభ్యుడు గాల్లోకి ఎగురుతూ కిందకు వచ్చే సన్నివేశం గగుర్పాటుకు గురిచేసేలా ఉంది.

Mumbai dance group performance stuns audience on Americas Got Talent show

అమెరికా వేదికపై ముంబై డ్యాన్స్ గ్రూప్ సభ్యులు ఇరగదీశారు. బాజీరావ్ మస్తానీ సినిమాలోని మల్హారీ పాటకు డ్యాన్స్ చేశారు. అద్భుతమైన స్టెప్పులతో వీక్షకుల జేజేలు అందుకున్నారు. సదరు వీడియోను అమెరికాస్ గాట్ టాలెంట్ షో నిర్వాహకులు తమ ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేయడంతో వీపరీతంగా వైరల్ అవుతోంది.

'వీ అన్‌బీటబుల్' డ్యాన్స్ ట్రూప్‌లో మొత్తం 28 మంది సభ్యులున్నారు. అందులో దాదాపు 12 నుంచి 27 సంవత్సరాల వయసు కుర్రాళ్లు ఉన్నారు. గణపతి బప్పా మోరియా అంటూ సాగిన ఆ డ్యాన్స్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. అంతలా అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తానికి అమెరికా వేదికపై ముంబాయి కుర్రాళ్లు ప్రదర్శించిన డ్యాన్స్ కు ప్రశంసలు దక్కడం విశేషం. డ్యాన్స్ ప్రారంభానికి ముందు వాళ్ల నేపథ్యం గురించి చెప్పడం ఆకట్టుకునేలా ఉంది. డ్యాన్స్ నేర్చుకోవడానికి వాళ్లు ఎంత కష్టపడ్డారో వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+