నవీన్ హత్యకేసు: హత్య వెనుక కిలాడీ నిహారిక: చంచల్ గూడా జైలుకు ప్రియురాలు!!
నవీన్ హత్య కేసులో హత్య వెనుక ప్రియురాలు నిహారిక పాత్ర ఉందని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించగా చంచల్ గూడా జైలుకు ప్రియురాలిని తరలించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ప్రియురాలి పాత్రను మొదటినుంచి హరిహర కృష్ణ తండ్రి , పోలీసులు అనుమానించిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణకు ఏమాత్రం సహకరించని నవీన్, హరి హరకృష్ణ ల ప్రియురాలు నిహారిక పోలీసులను ముప్పతిప్పలు పెట్టింది. తనను ఈ కేసులో ఇరికిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. సఖి కేంద్రానికి నిహారికను తరలించి ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు నిహారిక ఫోన్లో డిలీట్ చేసిన వాట్సప్ చాట్ లను రిట్రీవ్ చేసిన పోలీసులు ఈ హత్యలో నిహారిక పాత్రను గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. హరిహర కృష్ణకు సహకరించిన హసన్ ను కూడా అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టు ముందు హాజరు పరిచారు.
చంచల్ గూడా జైలుకు నవీన్ ప్రియురాలు నిహారిక
ఈ కేసులో ఏ 1 గా హరి హరకృష్ణ ఉండగా, ఏ 2, ఏ 3లుగా నిహారిక, హసన్ లను చేర్చిన పోలీసులు హయత్ నగర్ కోర్టు ముందు నిందితులను హాజరుపరచగా కోర్టు నిందితులకి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిహారికను చంచల్ గూడ జైలుకు, హసన్ ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. హసన్ ఈ కేసులో ప్రధాన నిందితుడైన హరి హర కృష్ణకు స్నేహితుడు కాగా, నిహారిక అటు నవీన్ తోనూ ఇటు హరి హరకృష్ణతోను ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిన గర్ల్ ఫ్రెండ్.

నవీన్ హత్య ప్రియురాలికి ముందే తెలుసు
గత నెల 17వ తేదీన నవీన్ ను అత్యంత దారుణంగా హతమార్చి తలా మొండెం వేరుచేసి, చాతిని చీల్చి గుండె బయటకు తీసి, వేళ్ళు కత్తిరించి, ఆధారాలు దొరక్కుండా శరీర భాగాలను కాల్చేసిన హరి హర కృష్ణ ప్రేమ కోసం ఇంత దారుణానికి ఒడిగట్టాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంత దారుణం ఒక్కడే చేసి ఉండడని నిందితుడి తండ్రి పదేపదే చెప్పాడు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కేసులో ప్రియురాలి పాత్ర కూడా ఉండడం, నవీన్ మర్డర్ విషయం ప్రియురాలికి ముందే తెలిసి ఉండడం అందరినీ షాక్ కు గురిచేస్తుంది.

హత్య తర్వాత గుడ్ బాయ్ అంటూ మెచ్చుకున్న నిహారిక.. హత్య ప్రదేశానికి వెళ్లి ఆపై ..
హరి హరకృష్ణ హత్య చేసిన తర్వాత ఈ విషయాన్ని నిహారిక కు చెప్పడంతో గుడ్ బాయ్ అంటూ హరి హరకృష్ణ ను నిహారిక మెచ్చుకున్నట్టు సమాచారం. ఆపై అవసరం ఉందని చెబితే 1500 రూపాయలు నిహారిక అతనికి ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు నవీన్ ని చంపిన అనంతరం ఈ విషయాన్ని నిహారికకు చెప్పడంతో పాటుగా, సంఘటనా స్థలానికి నిహారికను, హసన్ ను తీసుకువెళ్లి హరి హరకృష్ణ చూపించినట్టు పోలీసులు గుర్తించారు. ఆపై ఒక రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ భోజనం చేశారు.

ప్రియురాలి ఇంటికి వెళ్లి .. ఆమె ఫోన్లో డేటా డిలీట్ చేసిన నిందితుడు
హత్య చేసిన రోజు రాత్రి హరిహర కృష్ణ, హసన్ ఇద్దరూ కలిసి హత్య చేసిన ప్రదేశానికి వెళ్లి నవీన్ శరీర భాగాలను తీసుకొని మన్నెగూడ ప్రాంతంలో పడేశారు. ఆరోజు రాత్రి హరి హర కృష్ణ హసన్ ఇంట్లోనే ఉండి మరుసటి రోజు హస్తినాపురం క్రిస్టియన్ కాలనీలో ఉన్న నిహారిక ఇంటికి వెళ్లి, అక్కడే స్నానం చేసి, పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఆమె సెల్ ఫోన్ లో ఉన్న వాట్సప్ చాటింగ్ ను, నవీన్ మృతదేహానికి సంబంధించిన ఫోటోలను, కాల్ డేటాను డిలీట్ చేశాడని గుర్తించారు. ఇక ఈ కేసులో మొత్తంగా నిహారిక పాత్ర ఉండడంతో పోలీసులు ఈ కేసులో ఏం జరిగింది అన్న దానిపై మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications