Bigg Boss 7 telugu : నమ్మించి గొంతు కోసిన 'బిగ్ బాస్'
తెలుగులో అప్పుడే 'బిగ్ బాస్' ఫీవర్ మొదలైనట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే 'బిగ్ బాస్' సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. 7వ సీజన్‌ను సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి షో యాజమాన్యం సన్నాహలు చేస్తున్నారు. 'బిగ్ బాస్' కొత్త సీజన్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్న భారీ సెట్ కూడా పూర్తి కావొచ్చింది. ఈ సీజన్‌లో హోస్ట్‌ను మారుస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ , 7వ సీజన్‌లో కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
గత మూడు 'బిగ్ బాస్' సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఫెయిల్ అయ్యాయి. హౌస్‌లోకి వచ్చిన ఆర్టిస్టులు పెద్దగా ఫేమస్ కాకపోవడం..'బిగ్ బాస్' ఆడించే గేమ్స్ ఆసక్తికరంగా లేకపోవడం ఇలా అన్ని కలిసి.. 'బిగ్ బాస్' షో ప్లాప్ అయ్యేలా చేశాయి. దీంతో టీఆర్పీ రేటింగ్స్ సైతం భారీగా పడిపోవడంతో.. షో యాజమాన్యం .. 7వ సీజన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. దీనిని గ్రహించిన షో యాజమాన్యం ..7వ సీజన్‌పై తగు చర్యలు తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పటి వరకూ విడుదలైన ప్రోమోలు షోపై అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి.

'బిగ్ బాస్' ఏడో సీజన్‌లో కంటెస్ట్‌ల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తలు వహించినట్టు సమాచారం. ఫేమస్ యాకర్ట్స్‌తో పాటు, కపుల్స్‌ను కూడా ఈసారి ఎంపిక చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా 'బిగ్ బాస్' యాజమాన్యం చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో విడుదల చేసిన ప్రోమోనే మళ్లీ విడుదల చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'బిగ్ బాస్'కు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఆశపడిన నెటిజన్లకు నిరాశే ఎదురైంది. 'బిగ్ బాస్' నమ్మించి మోసం చేశాడని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే 'బిగ్ బాస్'పై అంచనాలు తగ్గిపోతాయ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తనికి ప్రోమోల ద్వారానే షోకు మంచి క్రేజ్ వచ్చే ప్లాన్ చేయడంలో షో యాజమన్యం సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తుంది. మరి త్వరలో ప్రారంభం కానున్న 'బిగ్ బాస్' ఏడో సీజన్ ఎలాంటి సంచనాలను సృష్టిస్తోందో చూడాలి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications