నో Omicron ఇన్ తెలంగాణ: ఉస్మానియాలో క్యాథ్ ల్యాబ్ సేవలు: మంత్రి హరీశ్ రావు
బ్రిటన్‌లో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. దీంతో ప్రపంచ మరింత వణుకుతుంది. ఇటు పొరుగు రాష్ట్రం ఏపీలో ఫస్ట్ కేసు వచ్చిన సంగతి తెలిసిందే. విజయనగరంలో కేసు వచ్చిందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇటు తెలంగాణలో కూడా కేసులు అని ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమీ లేదని వైద్యారోగ్య శాఖ స్పష్టంచేసింది. ఇప్పటివరకు ఎలాంటి కేసులు రాలేదని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు.

నో కేసు..
తెలంగాణలో ఇంతవరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇవాళ హైదరాబాద్‌లో గల నీలోఫర్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ యూనిట్ మంత్రి ప్రారంభించారు. ఉస్మానియా ఆస్పత్రిలో రేపు క్యాథ్ ల్యాబ్ సేవలను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నీలోఫర్ ఆస్పత్రిలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కర్ణాటక నుంచి వచ్చే వారికి నీలోఫర్ ఆస్పత్రిలో ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

లిమిట్ పెంపు
ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న లిమిట్ రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచామని హరీష్ రావు చెప్పారు. ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులు ఓపీ లో పనిచేయాలని, సర్జరీలు చేయాలని సూచించామని పేర్కొన్నారు. మాత శిశు మరణాల సంఖ్యలో తల్లుల మరణాల శాతం 92 నుంచి 69కి తగ్గిందని చెప్పారు. శిశు మరణాలు కూడా తగ్గాయని వివరించారు. నార్మల్ డెలివరీలు పెరిగాయని మంత్రి తెలిపారు.

వేగంగా..
థర్డ్ వేవ్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని ప్రచారం జరుగుతోందని.. దానిని ఎదుర్కోటానికి ప్రభుత్వం సిధ్ధంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆస్పత్రుల్లోని పడకలు, ఐసీయూ పడకలు, మందులు అంశం, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై రేపు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నామని హరీష్ రావు చెప్పారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సేవలు అద్భుతంగా అందుతున్నాయని ప్రజలు చెపుతున్నారని వివరించారు. రాష్ట్రంలో 13 జిల్లాలో సేవలు ప్రారంభించటానికి సిధ్దమవుతున్నామని ఆయన చెప్పారు.
Recommended Video

వణుకు
ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ గడ గడలాడించిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ మూడో వేవ్ అనడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే వైరస్ నేపథ్యంలో ఒకటికీ రెండుసార్లు తనిఖీ చేయడం సహజమే.. కానీ కొందరు అవమాన పడాల్సి వస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్ వైరస్ సోకుతుంది.












Click it and Unblock the Notifications