హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తలుపులు తీయండీ.. !అర్ధరాత్రీ ఇళ్లమందు హిజ్రాల హంగామా... పోలీసులకు పిర్యాధు

|
Google Oneindia TeluguNews

హిజ్రాల ఆగడాలు హైదరాబాద్ నగరంలో రోజురోజుకు శ‌ృతిమించి పోతున్నాయి. అడిగినంత ఇస్తారా లేదంటే చస్తారా.. అనే చందంగా ప్రజల వద్ద ముక్కుపిండి వసూలు చేస్తున్న సంఘటనలు కోకొల్లలు..దీంతో ఎందుకొచ్చిన తంటా అనుకుంటూ ఎవరికి తోచింది వారు ఇస్తున్నారు..అయితే ఇప్పటివరకు వాళ్ల ఆగడాలు దుకాణాల్లో, రోడ్లపైన, రైల్వే, బస్టాండ్స్‌లలో మాత్రమే ఉండేవి. తాజాగా హిజ్రాల ఆగడాలు ప్రజలు నివసించే కాలనీలకు సైతం పాకాయి..దీంతో వారి ఆగడాలపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది..

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ఫిలింనగర్లలో కొంతమంది హిజ్రాలు కిరాయకు ఉంటున్నారు. అయితే వారు అర్ధరాత్రి అయిందంటే చాలు కాలనీ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాత్రిపూట ఆరుపులు కేకలతో రోడ్లపై హంగామా చేస్తున్నారు. ఇదేమీటని అడిగితే కాలనీవాసులపై దాడులకు సైతం దిగుతున్నారు. రాత్రివేళ ఇళ్ల ముందు తలుపులు బాదడం తోపాటు తలుపులు తెరవకపోతే ఇళ్లముందు ఏదోఒక అసభ్యకర వస్తువులను వేసి వెళుతున్నారు. దీంతో చేసేదేమీలేక వారి అపాలని బంజారాహిల్స్ పోలీసులకు పిర్యాధు చేశారు.

nuisance case was booked against hijras

కాగా గతంలో కూడ ఇలాంటీ ఆగడాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.హిజ్రాలపై సానుభూతితో సమాజం వారిని చూస్తుంటే అదే అదనుగా హిజ్రాలు భావిస్తున్నారు.దీనికితోడు అసలు హిజ్రాలను పక్కన పడేసి ఫేక్ హిజ్రాలు రోడ్లమీదకు వచ్చి హంగామా చేస్తున్నారు. సాధరణంగా కొంతమంది ఇలాంటీ జట్లు కట్టి డబ్బుసంపాదనే లక్ష్యంగా గ్రూపులుగా కొనసాగుతున్న విషయాలు గతంలో కోకొల్లలుగా బయటపడ్డాయి. హైదరాబాద్ లోవారి ఆగడాలు శృతిమించుతున్నాయడంలో సందేహం లేదు . పోలీసులు ముందుగా దోంగ హిజ్రాల పని పడితే కాని ప్రజల బాధలకు విముక్తి కల్గిగే అవకాశాలు కన్పించడం లేదని పలువురు వాపోతున్నారు.

English summary
a case was booked against hijra's in bajara hills police station who is being done nuisance in the midnight at filmnager colony
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X