Oscar 2023: జూ ఎన్టీఆర్ కళ్లల్లో నీళ్లు - వెంటనే ఫోన్ చేసి షేర్ చేసుకున్నా : టైగర్ బ్యాక్ హోమ్..!!
ఆస్కార్ పురస్కారంతో యంగ్ టైగర్ సగర్వంగా తెలుగు గడ్డపైన కాలు పెట్టారు. తారక్ ఎమోషనల్ అయ్యారు.
ఆస్కార్ పురస్కారంతో యంగ్ టైగర్ సగర్వంగా తెలుగు గడ్డపైన కాలు పెట్టారు. అపూర్వ స్వాగతం అందుకున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన తారక్ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. ఇదే సమయంలో తారక్ ఎమోషనల్ అయ్యారు. తారక్‌తో పాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ సైతం నగరానికి చేరుకున్నారు. ఆస్కార్ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఆస్కార్ పురస్కారం వేళ రెడ్ కార్పెట్ పై ఆకట్టుకొనే విధంగా జూ ఎన్టీఆర్ - రాం చరణ్ మెరిసారు. జూ ఎన్టీఆర్ తన డ్రస్ పై పులి బొమ్మతో సందడి చేసారు. దీనికి కారణాలను చెప్పి మరింత తన పైన అందరినీ ఎట్రాక్ట్ చేసారు.
అంతకు మించిన సంతోషం ఏముంది
ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా..తెలుగు పాట ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. తెలుగు సినిమా ఖ్యాతిని..అచ్చ తెలుగు పాటకు ఆస్కార్ తో అభిమానులు ఖుషీగా ఉన్నారు. పురస్కారం అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ పురస్కారం ప్రకటన వేళ తన ఫీలింగ్స్ ఏంటో తెలుగు గడ్డ పైన కాలు పెట్టిన వేళ పంచుకున్నారు. నాటు నాటు పాటకు అవార్డు ప్రకటించిన సమయంలో ఆనందం తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ టీం చేతికి ఆ అవార్డు అందగానే అంతకు మించిన సంతోషం మరొకటి లేదనిపించిందని చెప్పుకొచ్చారు. ఇక, అవార్డు తెలియగానే ముందుగా తన సతీమణికి ఫోన్ చేసి తన ఆనందం పంచుకున్నానని తారక్ వెల్లడించారు.
కళ్లల్లో నీళ్లు తిరిగాయి
కీరవాణి..బోసు చేతిలో ఆస్కార్ చూసి కళ్లల్లో నీళ్లు తిరగాయని తారక్ ఎమోషనల్ అయ్యారు. ఆస్కార్ వేడుకల్లో పాలొనడం ఎంతో సంతోషంగా అనిపించిందని తారక్ అన్నాడు. కీరవాణి, చంద్రబోస్ అవార్డు పట్టుకొని స్టేజిపై నిల్చున్నప్పుడు ఆనందగా అనిపించింది. అది మాటల్లో వర్ణించలేనిది. మన దేశబరువు ఎంతుందో ఆస్కార్ బరువు అంతే ఉందని వెల్లడించాడు. భారతీయుడిని అందులో తెలుగువాడిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. మేము ఇంతటి గౌరవాన్ని దక్కించుకున్నామంటే దానికి కారణం అభిమానులు, సినీ ప్రేక్షకులు. వాళ్ల ప్రేమ, ఆశిస్సుల వల్లే ఈ అవార్డు సాధ్యమైంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికి నా కృతజ్ఞతలు అంటూ తారక్ వెల్లడించాడు.

అభిమానుల ఖుషీ
ఇదే సమయంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు వేళ తాను ధరించిన డ్రెస్ గురించి మరోసారి వివరించారు. 'ఆర్‌ఆర్‌ఆర్'లో తనతో కలసి దూకిన పులి ఇదే'.. అంటూ తారక్ సరదాగా మట్లాడారు. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తాను ఈ వస్త్రధారణ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఇక.. ఆస్కార్ అవార్డు వేడుకను ప్రపంచవ్యాప్తంగా సుమారు 18.7 మిలియన్ మంది వీక్షించారు. జూనియర్ ఎన్టీఆర్.. రాం చరణ్ ఫ్యాన్స్ పండుగ మూడ్ లో ఉన్నారు. ఈ ఇద్దరి హీరోల అభిమానుల సందేశాలతో సోషల్ మీడియా హోరెత్తింది. ఇప్పుడు తమ అభిమాన హారోలు స్వదేశానికి తిరిగి వస్తున్న వేళ ఘన స్వాగతం పలుకున్నారు. పార్లమెంట్ మొదలు దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ టీం పైన ప్రశంసలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications