కేసులు లెస్.. ఆక్సిజన్ బెడ్లు మాత్రం ఫుల్.. టెన్షన్.. టెన్షన్...
హైదరాబాద్ ఆస్పత్రులు, జిల్లాలలో కోవిడ్ -19 కేసులు తగ్గాయి. కానీ ఆక్సిజన్ బెడ్లు మాత్రం నిండిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినా కూడా ఆస్పత్రుల్లో చేరే కరోనా రోగుల సంఖ్య మాత్రం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ లెక్క 1,000 కేసుల కంటే తగ్గినప్పటికీ, యాక్టివ్ కేసులు మాత్రం 10,000 కేసులు ఉన్నట్లుగా చెబుతున్నారు . అందులో 4073 మంది ఇప్పటికీ ఆసుపత్రులలో తమ ప్రాణాలతో పోరాడుతున్నారు.

సిటీలో ఇలా..
హైదరాబాద్‌లో డజను ఆస్పత్రులు తమకు ఆక్సిజన్‌పై గణనీయమైన సంఖ్యలో రోగులు ఉన్నట్లు చెబుతున్నాయి. రోగుల సంఖ్య పెరుగుతోందని, కొన్ని ఆసుపత్రులలో పడకలు లేవని చెబుతున్నారు. కేసులలో పెరుగుదల ఉన్నందున, పడకలు నిండడం ప్రారంభం అయ్యిందని ప్రజలందరి కోసం అన్ని సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కిషన్ రావు అంటున్నారు.

నిమ్స్, గాంధీ
రాష్ట్రంలో ప్రధాన కోవిడ్ -19 చికిత్స కేంద్రాలలో, నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 50 ఆక్సిజన్ పడకలు ఉన్నాయని, గాంధీ ఆసుపత్రిలో కొత్తగా 30 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. కేసులు, ప్రవేశాల పెరుగుదలను బట్టి, ఆసుపత్రిలో నాన్ కోవిడ్ -19 సేవలను ప్రారంభించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది అని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. చెస్ట్ ఆసుపత్రిలో 14మంది ఆక్సిజన్ పడకలలో ఉండి చికిత్స తీసుకుంటూ ఉండగా.., కింగ్ కోటి ఆసుపత్రిలో 39మంది ఆక్సిజన్ చికిత్స పొందుతున్నారు.

ఈఎస్ఐలో ఇలా
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిలో 10మంది రోగులు ఆక్సిజన్ చికిత్స తీసుకుంటున్నారు. ఆక్సిజన్ పడకలపై గణనీయమైన సంఖ్యలో రోగులతో నగరంలో మరో అరడజను ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ పరిస్థితిని చూస్తుంటే ప్రజలు ఇంకా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

థర్డ్ వేవ్ ముప్పు
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
Recommended Video

ఫంగస్
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.