Plan-B: లేడీ రియల్ వ్యాపారి కిడ్నాప్, హైదరాబాద్ హోటల్ లో రూ. 50 లక్ష్లలకు డీల్, నకిలి పోలీసులకు?!
బెంగళూరు/హైదరాబాద్: వివాహం చేసుకున్న మహిళకు ఓ కుమార్తె ఉంది. కుమార్తె హైదరాబాద్ లో చదువుతోంది. బంధువుతో కలిసి మహిళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. హైదరాబాద్ లో పరిచయం అయిన వ్యక్తి ఆమెకు ఫోన్ లు చేసి టచ్ లో ఉన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మాట్లాడాలని మహిళను, ఆమె బంధువును నమ్మించి బెంగళూరు నుంచి బలవంతంగా పిలిపించారు. తరువాత మహిళను కిడ్నాప్ చేసి హైదరాబాద్ పిలుచుకుని వెళ్లారు.
మహిళను, ఆమె బంధువును కిడ్నాప్ చేసి రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో హైదరాబాద్ లో ఆ సిటీ పోలీస్ ఐడీ కార్డులతో మహిళను హోటల్ లో బెదిరించారు. డబ్బులు తీసుకురావాలని మహిళను వదిలేశారు. మహిళ రూ. 11 లక్షలు హైదరాబాద్ తీసుకెళ్లి ఆమె బంధువును విడిపించుకుంది. తరువాత మహిళ అసలు కథ మొదలు పెట్టింది

బెంగళూరు మహిళ
బెంగళూరు నగరంలోని కేఆర్ పురంలో వసంత అనే మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న వసంతాకు ఓ కుమార్తె ఉంది. వసంతా కుమార్తె హైదరాబాద్ లో చదువుతోంది. బంధువు శివారెడ్డితో కలిసి వసంత బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. శివారెడ్డి, వసంతా కలిసి బెంగళూరు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.

హైదరాబాద్ లో పరిచయం
కూతురి కోసం వసంతా, ఆమె బంధువు శివారెడ్డి హైదరాబాద్ వెళ్లి వస్తున్నారు. ఆ సందర్బంలో హైదరాబాద్ లో వసంతాకు హరీష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి హరీష్ వసంతాకు ఫోన్ లు చేస్తూ టచ్ లో ఉన్నాడు. బెంగళూరు వచ్చిన హరీష్ మైసూరు రోడ్డులోని స్యాటిలైట్ సిటీ దగ్గరకు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మాట్లాడాలని వసంతాను, ఆమె బంధువు శివారెడ్డిని నమ్మించి అక్కడికి పిలిపించుకున్నారు.

బెంగళూరు టూ హైదరాబాద్..... కిడ్నాప్
మైసూరు రోడ్డులోని ఏ టూ బీ హోటల్ లో కొంతసేపు మాట్లాడిన హరీష్, అతని స్నేహితులు ప్రసాద్, సత్యనారాయణ తరువాత వసంతా, శివారెడ్డిని బలవంతంగా కారులో దేవనహళ్లి పిలుచుకుని వెళ్లారు. దేవనహళ్లిలో వసంతను, ఆమె బంధువు శివారెడ్డిని కిడ్నాప్ చేసి నేరుగా కారులో అదే రోజు రాత్రి హైదరాబాద్ తీసుకెళ్లారు.

హైదరాబాద్ హోటల్ లో?
హైదరాబాద్ పిలుచుకుని వెళ్లిన తరువాత అక్కడి ట్రెటెంట్ జిమ్ హోటల్ 11వ అంతస్తులో వసంతా, శివారెడ్డని నిర్బందించారు. ఆ సందర్బంలో హరీష్ అతని స్నేహితులు ప్రసాద్, సత్యనారాయణ, మహారాష్ట్రకు చెందిన శ్రీధర్, కిరణ్ నాగూరావ్ వసంతా, శివారెడ్డికి పరిచయం చేశారు. నిందితులు హైదరాబాద్ సిటీ పోలీసుల పేరుతో ఉన్న నకిలీ ఐడీ కార్డులు వసంత, శివారెడ్డికి చూపించి రూ. 50 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు.

నగలు కుదువపెట్టి రూ. 11 లక్షలు
హైదరాబాద్ లో ఆ సిటీ పోలీస్ ఐడీ కార్డులతో వసంతాను హోటల్ లో బెదిరించారు. డబ్బులు తీసుకురావాలని వసంతాను వదిలేసి శివారెడ్డిని హైదరాబాద్ లో పెట్టుకున్నారు. బెంగళూరు వచ్చిన వసంతా నగలు కుదువ పెట్టి రూ. 11 లక్షలు హైదరాబాద్ తీసుకెళ్లి హరీష్ కు ఇచ్చి ఆమె బంధువు శివారెడ్డిని విడిపించుకుంది.

హైదరాబాద్ లో నకిలీ పోలీసులు అరెస్టు
తరువాత బెంగళూరు వచ్చిన వసంతా ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు హరీష్ తో పాటు ఆరు మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీసుల పేరుతో మహిళ దగ్గర రూ. 11 లూటీ చేసిన నకిలి పోలీసులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications