జూబ్లీహిల్స్ రేప్ కేసు: ఆ ముగ్గురిని పోలీసులు ఎలా పట్టుకున్నారు..? VoIP కాల్ అంటే ఏంటీ..?

జూబ్లీహిల్స్ రేప్ కేసు తర్వాత ఏం జరిగింది..? ఆ యువతి పేరంట్స్‌కు చెబుతుందని నిందితులు అనుకున్నారా..? ఒకవేళ చెబితే ఏం చేయాలి.. అందుకోసమే వారు చెక్కేశారా అనే సందేహాలు కలిగాయి. కానీ అవన్నీ పోలీసుల విచారణలో నిజం అని తేలాయి. అయితే యువతిని పబ్ వద్ద డ్రాప్ చేసిన తర్వాత.. నిందితులు చాకచక్యంగా తప్పించుకున్నారు. ఒక్కొక్కరు ఓ ప్రాంతానికి వెళ్లారు. అయినప్పటికీ ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి.. కలుగులో ఉన్న ఎలుకలను తీసిన విధంగా ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

 ఇలా పట్టుబడ్డారు..

ఇలా పట్టుబడ్డారు..


ఇద్దరు మైనర్లు పేరంట్స్‌తో ఉండగా.. మూడో మైనర్ నెల్లూరులో గల ఆ ప్రార్థన మందిరం వద్ద పట్టుబడ్డాడు. రేప్ ఘటన గత నెల 28వ తేదీన జరగగా.. 31వ తేదీన కంప్లైంట్ ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బంజారాహిల్స్‌లో ఉంటున్న ఒకతను తన కుటుంబంతో కలిసి తమిళనాడు వెళ్లారు. మరొకరు సంగారెడ్డి మీదుగా గోవా వెళ్లారు. మూడో వ్యక్తి ప్రజా రవాణాను ఉపయోగించి ఏపీలో గల నెల్లూరు చేరుకున్నారు. మిగతా వారు మొయినాబాద్‌లో గల ఫామ్ హౌస్‌లో నక్కి ఉన్నారు.

స్పెషల్ టీమ్

స్పెషల్ టీమ్


రంగంలోకి దిగిన పోలీసులు, స్పెషల్ పోలీస్ టీమ్, టాస్క్ ఫోర్స్.. నిందితుల జాడను కనుగొనే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే వారు తమ మొబైల్స్ స్వీచ్ ఆఫ్ చేశారు. అలాగే తమ సిమ్ కార్డ్ ఉపయోగించడం మానేశారు. అలాంటి సమయంలో తాము VoIP (వీవోఐపీ) కాల్స్ ద్వారా కనుగొన్నామని పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

 VoIP కాల్ అంటే ఏంటీ..?

VoIP కాల్ అంటే ఏంటీ..?


VoIP కాల్ అంటే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పసిగడతారు. వ్యాపార కమ్యునికేషన్ గురించి తెలిసిన వారికి ఐడియా ఉంటుంది. ఈ కాల్.. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సూచిస్తోంది. టెలిఫోనిక్ సంబంధించినది. కానీ ఎలా పనిచేస్తుందో.. ఏమీ చేయగలదో మిగతా జనాలకు తెలియదు. నిపుణులకు మాత్రం తెలుస్తోంది. అలా ఈ నిందితులను పట్టుకున్నారు. అలా దాక్కున్న నిందితులను కూడా పోలీసుల పట్టుకున్నారు.

 ఫ్యామిలీపై నిఘా

ఫ్యామిలీపై నిఘా


పరారీలో ఉన్న నిందితుల కుటుంబ సభ్యులపై పోలీసులు నిఘా ఉంచారు. అలా వారి కాల్స్ ట్రాప్ చేసి.. దాచిన ప్రదేశాలను కనుగొగలిగారు. నెల్లూరులో ఓ ప్రార్థనా స్థలం వద్ద మైనర్ ఆశ్రయం పొందాడు. మరొ ఇద్దరు మాత్రం ఫ్యామిలీతో ఎంచక్కా కారులో ప్రయాణించారు. తమిళనాడు సేలంలో ఒకరిని గుర్తించారు. మరొకరిని గోవా వెళ్లగా గుర్తించి పట్టుకున్నారు. మొయినాబాద్‌లో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నారు. ఇలా నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకోగలిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+