హైదరాబాద్ శివారు ఫాంహౌస్‌లపై పోలీసుల దాడులు: 26 మంది అరెస్ట్
హైదరాబాద్ నగర శివారులోని పలు ఫాంహౌస్‌లపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. పలు ఫాంహౌస్‌లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు.
హైదరాబాద్: నగర శివారులోని పలు ఫాంహౌస్‌లపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. పలు ఫాంహౌస్‌లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు.
మొయినాబాద్‌లోని బిగ్ బాస్ ఫాంహౌస్, జమంగీర్ డ్రీమ్ వ్యాలీ, శంషాబాద్ పరిధిలోని రిఫ్లైజ్ ఫాంహౌస్, మేడ్చల్ లోని గోవర్ధన్ రెడ్డి ఫాంహౌస్ లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫాంహౌస్‌ల నుంచి మద్యం సీసాలు, హుక్కా సామాగ్రి, ప్లేయింగ్ కార్డ్స్, లక్ష రూపాయల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం 32 ఫాంహౌస్‌లలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అసాంఘిక కాకర్యకలాపాలకు పాల్పడుతున్న 26 మందిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఫాంహౌస్‌లపై పోలీసులు దాడులు చేశారు. నగరానికి దూరంగా ఉండటంతో ఫాంహౌస్‌లలోనే ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తుండటంతో పోలీసులు తరచూ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
భారీగా గంజాయి పట్టివేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బస్టాండ్ వైపు నుంచి భద్రాచలం బ్రిడ్జి వైపుగా అనుమానాస్పదంగా వస్తోన్న రెండు ఇన్నోవా కార్లను గుర్తించిన పోలీసులు.. తనిఖీ చేశారు. ఆ వాహనాల్లో 488 కిలోల గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ జీ వినీత్ తెలిపారు. ఏపీ-ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు 97.6 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications