నివురు గ‌ప్పిన నిప్పులా హైద‌రాబాద్‌?? అరాచక శక్తుల కదలికలపై నిఘా

హైద‌రాబాద్ న‌గ‌రానికి మ‌త క‌ల‌హాలు కొత్త కాదు. కులం, మ‌తం, జాతి అంటూ రాజ‌కీయాలు చేసే నేత‌ల స్వార్థానికి ఎంతోమంది అమాయ‌కులు గతంలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఎక్క‌డైనా మ‌తానికి సంబంధించిన సంఘ‌ట‌న జ‌రిగినా, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు విన‌వ‌చ్చినా హైద‌రాబాద్ ఉలిక్కిప‌డుతుంటుంది.

తాజాగా భార‌తీయ జ‌న‌తాపార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. ఈనెల 22వ తేదీన ఆయ‌న ఒక వ‌ర్గాన్ని ఉద్దేశిస్తూ సోష‌ల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో చేసిన వ్యాఖ్య‌ల‌పై హైద‌రాబాద్‌తోపాటు రాష్ట్ర‌వ్యాప్తంగా అల్ల‌ర్లు జ‌రిగే ప్ర‌మాద‌ముంద‌ని అంచ‌నా వేసిన పోలీసులు వెంట‌నే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.

మునుగోడు కోసం రాష్ట్రాన్ని తగలబెడతారా?

మునుగోడు కోసం రాష్ట్రాన్ని తగలబెడతారా?

రాజాసింగ్ వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా పాత‌బ‌స్తీలో ఒక వ‌ర్గం ప్ర‌జ‌లు నిర‌స‌న‌గా రోడ్ల‌పైకి వ‌చ్చి నినాదాలు చేశారు. ఎంఐఎం ఎంపీ అక్బ‌రుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. ఎనిమిది సంవ‌త్స‌రాలుగా ప్ర‌శాంతంగా ఉన్న తెలంగాణ‌లో మతం మంట‌లు రాజేయాల‌ని చూస్తున్నారా? అంటూ బీజేపీ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం తెలంగాణ‌ను త‌గ‌ల‌బెడ‌తారా? అంటూ నిల‌దీశారు.

మళ్లీ అరెస్టయిన రాజాసింగ్

మళ్లీ అరెస్టయిన రాజాసింగ్


41 సీఆర్‌పీసీ కింద నోటీసులివ్వ‌కుండా అరెస్ట్ చేయ‌డం సుప్రీంకోర్టు నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మంటూ నాంప‌ల్లి కోర్టు అరెస్ట‌యిన రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది. మ‌రో వీడియోను విడుద‌ల చేస్తానంటూ రాజాసింగ్ నిర్భ‌యంగా మీడియాకు తెల‌ప‌డంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు మ‌ళ్లీ అరెస్ట్‌చేసి పీడీ యాక్ట్ న‌మోదు చేశారు. 2004 నుంచి రాజాసింగ్‌పై 101 క్రిమిన‌ల్ కేసులు, 18 మ‌త‌ప‌ర‌మైన కేసులు న‌మోద‌య్యాయ‌ని న‌గ‌ర క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ తెలిపారు. మంగ‌ళ‌హాట్ స్టేష‌న్ ప‌రిధిలో రౌడీషీట్ న‌మోదైన‌ట్లు వెల్ల‌డించారు.

ఈనెల 31న వినాయకచవితి

ఈనెల 31న వినాయకచవితి


మ‌రోవైపు ఈనెల 31వ తేదీన వినాయ‌క చ‌వితి పండ‌గ ఉంది. ఈ ప‌ర్వ‌దినాన్ని హైద‌రాబాద్‌లో భారీగా నిర్వ‌హిస్తారు. ఇటువంటి త‌రుణంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ప్ర‌తిస్పంద‌న‌గా ఏదైనా జ‌రిగితే ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో జ‌రిగిన స‌భ‌లో కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ‌ను ఆగం కానివ్వ‌బోమ‌ని, మ‌తం మంట‌ల్లో చలికాచుకునే నీచ నాయ‌కుల‌ను త‌రిమికొట్టాల‌ని పిలుపునిచ్చారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు భంగం వాటిల్లేలా వ్యాఖ్య‌లు చేసేవారిని, అరాచ‌క‌శ‌క్తుల‌ను త‌రిమికొట్టాల‌ని, వారిని అణ‌చివేయండంటూ పోలీసుల‌కు ఆదేశాలు జారీచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+