రేపే పాలిసెట్ ఫలితాలు.. ఉదయం 11.30 గంటలకు విడుదల
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2022) ఫలితాలు బుధవారం రిలీజ్ అవుతాయి. ఉదయం 11.30 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని పాలిసెట్ కన్వీనర్ సి.శ్రీనాథ్ వెల్లడించారు. జూన్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 365 కేంద్రాల్లో పాలిసెట్ పరీక్షను నిర్వహించారు. లక్ష మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ డిప్లొమా సీట్లను భర్తీ చేస్తారు.

పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించి ఈ సారి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను ప్రకటిస్తారు. ఇందులో ఒకటి టెక్నికల్ పాలిటెక్నిక్ ర్యాంకు కాగా.. మరొకటి అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిప్లొమా ర్యాంకుగా ఉండనుంది. రాష్ట్రంలో సివిల్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్, కంప్యూటర్ సంబంధిత కోర్సుల దాకా పెద్ద సంఖ్యలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు కోర్సుల కాల వ్యవధి మూడేళ్లు కాగా.. కొన్నింటికి మూడున్నరేళ్ల కాల వ్యవధి ఉంటుంది.
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చాలా వరకు ఇంజనీరింగ్ సంబంధిత సబ్జెక్టులు ఉంటాయి. అందువల్ల పాలిటెక్నిక్ పూర్తయ్యాక ఈసెట్ పరీక్ష రాసి నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. చాలా వరకు పాలిటెక్నిక్ కోర్సులకు నేరుగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. పలు రకాల కంపెనీలు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ప్రాధాన్యత నిస్తున్నాయి. దీంతో ఈ కోర్సుకు ఇప్పటికీ మంచి ఆదరణ లభిస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications