Raja singh మరో వీడియో: కేటీఆర్, అసద్ లక్ష్యంగా విమర్శలు
మహ్మద్ ప్రవక్తపై కామెంట్లకు సంబంధించి రాజా సింగ్‌ను ఇవాళ మరోసారి అరెస్ట్ చేశారు. అంతకుముందే 41 సీఆర్పీసీ ప్రకారం నోటీసు ఇవ్వగా.. సమాధానం కూడా చెప్పారు. ఆ వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఫస్ట్ వీడియోలో రాజా సింగ్.. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. అతనిని బీజేపీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసింది. ఇప్పుడు మరో వీడియో ఆయన రిలీజ్ చేశారు.
హైదరాబాద్లో ప్రస్తుత పరిస్థితులకు మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్లే కారణమని ఆ వీడియోలో రాజా సింగ్ వివరించారు. కేటీఆర్, అసద్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాముడు, సీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సభ్యత్వం రద్దుపై అప్పట్లో ఎందుకు స్పీకర్కు ఫిర్యాదు చేయలేదని వీడియోలో రాజాసింగ్ ప్రశ్నించారు. తన శాసనసభ సభ్యత్వం రద్దు చేసినా పర్లేదు. ధర్మం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. పోలీస్ వాహనాలను ధ్వంసం చేసిన వారిని.. తలలు నరకుతామన్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు.
मुझे आज या कल गिरफ्तार किया जा सकता है
— Raja Singh (@TigerRajaSingh) August 25, 2022
मैं बस इतना कहना चाहूंगा कि अगर कोई मेरे देश मेरे धर्म को बुरा कहेगा तो मैं उसे उसी की भाषा मे जवाब दूंगा चाहे इसकी सजा जो भी हो अब हिन्दू पीछे हटने वाला नही
आशा करता हु की इस धर्म युद्ध मे हर हिन्दू हमेशा की तरह मेरा साथ देगा
जय श्री राम pic.twitter.com/wOLpOGsvZC
తాను ఎవరి దేవుడు పేరును ప్రస్తావించలేదు. చరిత్రను మాత్రమే చెప్పాను. మునావర్ షో వద్దని సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్‌రెడ్డి, కేటీఆర్కు చెప్పినా వినలేదు. ఈగోతో 5 వేల మంది పోలీసులతో కేటీఆర్ షో చేయించారని వీడియోలో రాజాసింగ్ దుయ్యబట్టారు.

కమెడియన్ మునావర్ ఫారూఖీపై విమర్శలతోపాటు ముస్లింలను రెచ్చగొట్టేలా మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి, మతపరమైన వ్యాఖ్యలతో 10.27 నిమిషాల వీడియో చేసి తన యూట్యూబ్ చానల్‌లో రాజాసింగ్ అప్‌లోడ్ చేశారు. గంట వ్యవధిలో ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. దీంతో ముస్లింలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిమిషాల వ్యవధిలో పాతబస్తీలో గల కూడళ్లలో నిరసన చేపట్టారు. వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ల ముందు ఆందోళనలకు దిగారు.












Click it and Unblock the Notifications