కొత్త రేషన్ కార్డుల పంపిణీ, 26వ తేదీ నుంచి డిస్ట్రిబ్యూట్.. మంత్రులు, ఎమ్మెల్యేలు
కొత్త రేషన్ కార్డులను పంపిణీపై క్లారిటీ వచ్చింది. ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేస్తారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు.
పౌరసరఫరాలశాఖపై మంత్రి గంగుల కమలాకర్, అధికారులతో సీఎం కేసీఆర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మిల్లింగ్ సామర్థ్యం పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ వారితో చర్చించారు. జూలై 26 నుంచి 31వ తేదీ వరకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పౌర సరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్‌కు ఆదేశాలు జారీచేశారు.
ప్రస్తుతం రేషన్ మీద బియ్యం అందజేస్తున్నారు. కరోనా వల్ల ఒక్కొక్కరికీ 15 కిలోల బియ్యం ఇస్తున్నారు. అంతకుముందు చక్కెర, పప్పులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బియ్యం, సర్ప్ మాత్రమే ఇస్తున్నారు. అంత్యోదయ కార్డు ఉన్నవారికి ఎక్కువగా బియ్యం ఇస్తారు.