సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న షాద్ నగర్ పోలీసుల డ్యాన్సులు .. సిఐ శ్రీధర్ పై సీపీ వేటు

షాద్ నగర్ పోలీసులు .. ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది మాత్రం దిశా నిందితుల ఎన్ కౌంటర్ . దిశా నిందితుల ఎన్ కౌంటర్ తో ప్రజల నుండి శభాష్ అనిపించుకున్న పోలీసులు ఆ తర్వాత మాన హక్కుల కమీషన్ ఈ ఎన్ కౌంటర్ ను సుమోటోగా తీసుకుని విచారిస్తున్న నేపధ్యంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . ఇక ఇలాంటి సమయంలో షాద్ నగర్ పోలీసులు గెట్ టు గెదర్ పేరుతో పార్టీ చేసుకుని అదిరిపోయేలా డ్యాన్సులు చేయటం సోషల్ మీడియాలో రచ్చగా మారింది.

షాద్ నగర్ పోలీసుల గెట్ టూ గెదర్

షాద్ నగర్ పోలీసుల గెట్ టూ గెదర్

షాద్ నగర్ పోలీసులు గెట్ టూ గెదర్ చేసుకున్నారు. మంచి జోష్ తో పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ అదిరిపోయేలా స్టెప్ వేశారు. అంతే కాదు తమ సెలబ్రేషన్స్ అంతా మొబైల్స్‌లో రికార్డ్ చేసుకున్నారు. ఇక దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఇక షాద్ నగర్ పోలీసుల తీరుపై రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి . బాధ్యతయుతంగా ఉండాల్సిన పోలీసులు పార్టీలు చేసుకుంటూ డ్యాన్సులు చేయడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలోకి రావటంతో సీపీ సజ్జనార్ క్రమశిక్షణా చర్యలు చేపట్టారు.

డ్యాన్సులతో అదరగొట్టిన పోలీసులు ... సిఐ శ్రీధర్ పై వేటు

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఆదివారం టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో గెట్ టు గెదర్ ఏర్పాటు చెయ్యటం , ఇక ఆ గెట్ టూ గెదర్ పార్టీ, వారి చిత్ర విచిత్ర డ్యాన్సులు ,నాగినీ స్టెప్ లు వైరల్ కావటంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు . ఇక దీనిపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ మండిపడ్డారు. షాద్‌నగర్‌ సీఐ శ్రీధర్‌ను బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. సిఐ శ్రీధర్ ను హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు. ఇక ఈ ఘటనపై విచారణ జరపాలని , ఏం జరిగిందో నివేదిక అందించాలని సీపీ సజ్జనార్ షాద్‌నగర్‌ ఏసీపీని ఆదేశించారు.

దిశా హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ లో కీలక భూమిక పోషించిన సిఐ

దిశా హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ లో కీలక భూమిక పోషించిన సిఐ


ఇక దిశా హత్యా కేసు నిందితుల ఎన్ కౌంటర్ లో కీలక పాత్ర పోషించిన షాద్ నగర్ సిఐ శ్రీధర్ పై సీపీ వేటు వెయ్యటం పోలీసు వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది. దిశా హత్యకేసు నిందితులను షాద్ నగర్ పోలీసు స్టేషన్ లో ఉంచి అక్కడ నుండి వారిని దిశాను సజీవ దహనం చేసిన సంఘటనా స్థలానికి తీసుకెళ్ళి ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే . అప్పుడు సిఐ శ్రీధర్ పై కూడా ప్రజలు ప్రశంసల జల్లు కురిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+