వేగవంతమైన సమాచారం కోసం స్మార్ట్ సిబిఎస్ యాప్.!ప్రారంభించిన సైబరాబాద్ సీపి స్టీఫెన్ రవీంద్ర.!
సైబరాబాద్/హైదరాబాద్ : సైబరాబాద్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో వైకె ఇన్నోసాఫ్ట్ టెక్నాలజీ సహకారంతో నూతనంగా పొందుపర్చిన స్మార్ట్ సిబిఎస్ సాఫ్ట్ వేర్ ను మరియు సభ్యుల కోసం యాప్ ను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా సభ్యులు కోఆపరేటివ్ సొసైటీలోని ఎటువంటి సమాచారాన్నైనా వెనువెంటనే పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడారు.
ముందుగా డైరెక్టర్లు కార్యవర్గ సభ్యులు అందరికీ అభినందనలు తెలిపారు. సహకార సంఘం కార్యకలాపాలను ఆటోమేట్ చేయడం ద్వారా సహకార సంఘం మరిన్ని సేవలను సభ్యులుకు అందించడంలో సహాయపడుతుందన్నారు. వైకె ఇన్నో సాఫ్ట్ టెక్నాలజీ సహకారంతో కో-ఆపరేటీవ్ సొసైటీలో నూతన సాఫ్ట్వేర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, దీని వల్ల ఎటువంటి సమాచారం కావాలన్నా పొందవచ్చన్నారు. కార్యకలాపాలలో మరింత పారదర్శకతను తెస్తుందన్నారు.

అంతే కాకుండా దీనిని విజయవంతంగా పూర్తి చేసిన వైకె ఇన్నో సాఫ్ట్ టెక్నాలజీ అధినేత శ్రావణ్ కీర్తిపాటి, వారి బృందాన్ని మెమెంటో ఇచ్చి సీపీ అభినందించారు.సైబరాబాద్ పోలీసుల చే నిర్వహించబడుతున్న గచ్చిబౌలి, మొయినాబాద్, మైలార్దేవ్ పల్లి, మొయినాబాద్ లోని పెట్రోల్ బంకుల్లో వచ్చిన ఆదాయాన్ని సభ్యులు సంక్షేమానికి ఉపయోగిస్తామన్నారు.

సైబరాబాద్ జాయింట్ సీపీ శ్రీ అవినాష్ మహంతి, ఐపీస్., గారు మాట్లాడుతూ.. పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీలో కొత్త పాలసీలను పాటు, వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రవేశపెట్టి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వైకె ఇన్నోసాఫ్ట్ సిఇఓ శ్రావణ్ కీర్తిపాటి గారు సభ్యులకు మొబైల్ అప్లికేషన్ పై డెమో ఇవ్వడం జరిగింది మరియు పోలీసులకు పారదర్శకతతో సేవలందించడానికి వినూత్న కార్యక్రమాలు చేస్తున్న సైబరాబాద్ పోలీసు వారికి అభినందనలు తెలియజేశారు.













Click it and Unblock the Notifications