హైదరాబాదులో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం
హైదరాబాద్‌లో ఈదురుగాలుల బీభీత్సం...సృష్టించాయి.అనంతరం కాసేపు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండలకు మండిపోతున్న నగర వాసులకు రాత్రి కురిసిన వర్షాలు కాస్త ఉపశమనం కల్గించాయి. కాగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, గఛ్చిబౌలి ,బంజారహిల్స్, తోపాటు ఉప్పల్ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి, కాగా వాతవరణ శాఖ రెండురోజుల పాటు వర్షసూచన ఉండనున్నట్టు ముందే హెచ్చరించింది.
కాగా వర్షాలు కురవడానికి ముందు భారీ ఎత్తున ఈదురు గాలులతోపాటు, ఉరుములు,మెరుపులు చేటుచేసుకున్నాయి. దీంతో అదే సమయంలో వివిధ కార్యాలయాల నుండి ఇళ్లకు వెళ్లేవారు చాల ఇబ్బందులు పడ్డారు. కాగా ఈదురు గాలుల నేపథ్యంలో పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడ కల్గింది.మొత్తం గత కోద్ది రోజులుగా 45 డిగ్రిలకు పైగ ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు చాల ఇబ్బందులకు గురయ్యారు. కాగ ఈ వర్షాలతో కాస్త ఉపశమనం పొందారు.













Click it and Unblock the Notifications