తేజస్విని చౌదరీకి ఏం సంబంధం లేదు, రేణుకా చౌదరి.. బదనం చేస్తున్నారు, నటి హేమ
బంజారాహిల్స్ పబ్ డ్రగ్ కేసు పెను దుమారం రేపుతోంది. ప్రముఖుల పిల్లలు ఉండటం.. వారి పేర్లు బయటకు రావడంతో పలువురు స్పందిస్తున్నారు. నిహారికకు సంబంధించి నాగబాబు.. రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా రియాక్ట్ అయ్యారు. ఇక మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి కూతురు తేజస్విన్ చౌదరి పేరు కూడా వచ్చింది. దీంతో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి స్పందించారు.

తేజస్విని చౌదరి కాదే..
ఫుడ్డింగ్, మింక్ యజమాని తన కూతురు కాదని ఆమె స్పష్టంచేశారు. రైడ్‌లో పోలీసులు అదుపులో తీసుకోలేదన్నారు. తేజస్విని చౌదరిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. అసలు రైడింగ్ జరుగుతున్న సమయంలో పుడ్డింగ్ మరియు మింక్ వద్ద లేనట్లు తెలిపారు. జరిగిన దాడిలో భాగంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారనే వచ్చిన ప్రసారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఏ ప్రకటనలు ఏవీ నిజం కాదు. అన్ని అసత్యాలు అని చెప్పారు. సెన్సేషనల్ రిపోర్టింగ్‌లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లను ప్రస్తావించి, లాగడానికి ముందు మీడియా సంస్థలు ప్రాథమిక పాత్రికేయ ప్రమాణాలను పాటించాలని సూచించారు.

మరీఅప్పడు అలా..
ఇదివరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు పబ్ నిర్వహకురాలు తేజస్విని చౌదరి ఇంటర్వూ ఇచ్చిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ పబ్ ఆయుర్వేదిక్ కాక్‌టైల్స్‌కు కేరాఫ్ అంటూ ఆమె అందులో చెప్పుకొచ్చారు. నో హ్యాంగోవర్ డ్రింగ్స్ సర్వ్ చేస్తామని, ఏ క్లాస్ కస్టమర్ల కోసమే స్పెషల్‌గా నడిచే పబ్ అంటూ పుడ్డింగ్ అండ్ మింక్ గురించి ఆమె చెప్పారు.

డ్రగ్స్ దందా..
ఈ డ్రగ్స్ ఎక్కడిది..? మీకు ఎవరూ సరఫరా చేశారు..? అన్న దానిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూపీ లాగుతున్నారు. నలుగురిని అరెస్ట్ చేసిన అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అరెస్టైన వారిలో పబ్ నిర్వాహకుడు అభిషేక్, ఈవెంట్ మేనేజర్ అనిల్ ఉన్నారు. ఈ కేసులో మరింత పురోగతి సాధించేందుకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఏసీపీ నర్సింగ్ రావు, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనాథ్ రంగంలోకి దిగి కేసు విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ ఘటన కలకలం రేపిన వెంటనే బంజారాహిల్స్ సీఐ శివచంద్రను... సీపీ సీవీ ఆనంద్ సస్పెండ్ చేయగా, ఏసీపీకి మెమో జారీ చేశారు. కొత్త సీఐగా నాగేశ్వర్‌రావును నియమించారు. గత ఆరేళ్లలో టాస్క్‌ఫోర్స్‌లో నాగేశ్వర్‌రావు కీలక పాత్ర పోషించారు. పలు డ్రగ్స్ రాకెట్లను బట్టబయలు చేశారు నాగేశ్వర్‌రావు.

హేమ రియాక్షన్
ఇటు నటి హేమపై కూడా ఆరోపణలు వచ్చాయి. దాడి జరిగిన సమయంలో ఆమె కూడా అక్కడే ఉన్నారని ప్రచారం జరిగింది. దీంతో మీడియాపై ఆమె మండిపడ్డారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వచ్చారు. తనకు సంబంధం లేకున్నా.. కావాలనే ప్రసారం చేస్తున్నారని ఫైరయ్యారు. తనను బదనాం చేస్తున్నారని ఫైరయ్యారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications