తెలంగాణ 2021-22 వార్షిక బడ్జెట్ రూ.2,30,825 కోట్లు: సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు
హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ సర్కార్ రూపొందించిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావు సభలో ప్రవేశపెట్టారుజ ఈ ఉదయం 11:30 గంటలకు ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అంతకుముందు బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గత ఏడాది 1.82 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ సారి ఈ సంఖ్య మరింత పెరగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. రెండు లక్షల కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదనలు చేయొచ్చని అంటున్నారు. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన లాక్‌డౌన్ పరిణామాల వల్ల సుమారు 50 వేల కోట్ల రూపాయల మేర రాబడి తగ్గిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించిన పూర్తి వివరాలు మినిట్ టు మినిట్ మీ కోసం అప్‌డేట్..













Click it and Unblock the Notifications