తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: డీఏ పెంపు, ఎంతంటే?

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డీఏ), పింఛనుదారులకు కరవు భృతి(డీఆర్) 2.73 శాతం పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. డీఏ పెంపు 2022 జనవరి నుంచి వర్తిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వంపై నెలకు రూ. 81.18 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 974.16 కోట్ల అదనపు భారం పడనుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

 telangana government hikes DA for employees and pensioners.

పెంచిన డీఏ ప్రకారం ఉద్యోగులు, పింఛనుదారులకు 2022 జనవరి 1 నుంచి 2023 మే 31 వరకు రూ. 1380.09 కోట్ల బకాయిలను చెల్లించనున్నారు. పెరిగిన డీఏ జూన్‌ నెల వేతనం, పింఛనుతో కలిపి ఇవ్వనున్నట్లుగా మంత్రి హరీష్ రావు ఈ తాజా ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఒక డీఏ విడుదల చేసింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీఏ విడుదల చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. డీఏ పెంపుపై టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూటీఎస్, ట్రెసా, పెన్షనర్ల జేఏసీ, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తికి సీఎం కేసీఆర్ ఆదేశం

రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇవ్వడం సహా అన్ని క్యాడర్ల ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (టీఆర్‌ఈఎస్‌ఏ) అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి , ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ మన్నె ప్రభాకర్‌ సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ని కలిసి తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు అన్ని క్యాడర్ల వారికి ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో వెంటనే చర్చించి ప్రమోషన్ల ప్రక్రియకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని సీఎస్‌ను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+