Number Plate: రూ.25 లక్షల పలికిన ఫ్యాన్సీ నంబర్..

కొంత మంది వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఫ్యాన్సీ నంబర్ లేదా వారికి కలిసొచ్చే నంబర్ కోసం చూస్తారు. అయితే రవాణా శాఖ కూడా కావాల్సిన నంబర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే కావాల్సిన నంబర్ కావాలంటే అధిక మొత్తం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్లకు వేలం పాట నిర్వహిస్తుంటుంది. ఎవరు ఎక్కువకు పాడుకుంటే వారికే నంబర్ కేటాయిస్తుంది. ఇలా కొన్ని సార్లు ఫ్యాన్సీ నంబర్ భారీ ధరకు వెళ్తాయి.

తాజాగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌టీఓ) నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఫ్యాన్సీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ 25.5 లక్షల రూపాయలకు ఇచ్చింది. "TG 09 9999" నంబర్ ప్లేట్‌ను సోనీ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్ అనే సంస్థ రూ. 25,50,002 భారీ ధరతో కొనుగోలు చేసింది. కంపెనీ యాజమాన్యంలోని టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనం కోసం నంబర్ ప్లేట్ ఉపయోగించనున్నారు.

The transport department has earned Rs 25 lakh by auctioning a fancy number

కొత్త శ్రేణి నంబర్‌లను వేలం వేసిన ఒక్క రోజులో రవాణా శాఖ ద్వారా మొత్తం రూ.43,70,284 ఆదాయం వచ్చిందని వారు తెలిపారు. మార్చిలో నగరంలో ఫ్యాన్సీ టీజీ నంబర్‌ ప్లేట్ల వేలం వేడయం ద్వారా ఆర్టీఏ రూ.30 లక్షల ఆదాయం సంపాదించింది. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 'TS' నుంచి 'TG'గా మార్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తర్వాత తెలంగాణ పాత వాహనాల నంబర్ ప్లేట్‌లకు అప్‌డేట్ కావాలా నే ఆసక్తి నెలకొంది.

కొత్త వాహనం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాహన యజమానులు TG నంబర్ ప్లేట్‌ను అందుకుంటారు. అయితే ఇప్పటికే రిజిస్టర్ అయిన వాహనాలు దానిని మార్చాల్సిన అవసరం లేదు. మొదటి TG నంబర్ ప్లేట్ TG 09 0001 వేలంలో రూ. 9.61 లక్షలు పలికింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+