Sajjannar: రెండు ఎన్ కౌంటర్లు: నాడు వరంగల్.. నేడు హైదరాబాద్: ఐపీఎస్ అధికారి ఒకరే.. ఆయనే!

హైదరాబాాద్: రెండు ఎన్ కౌంటర్లు. ఒకటి వరంగల్ లో.. ఇంకొకటి హైదరాబాద్. అమ్మాయిల జోలికి వెళ్లిన నిందితులకు విధించిన శిక్ష ఇది. ఈ రెండు ఎన్ కౌంటర్ల చోటు చేసుకున్న సమయాల్లోనూ పోలీసులకు దిశా నిర్దేశం చేసిన అధికారి ఒక్కరే.. ఆయనే వీసీ సజ్జన్నార్. ప్రస్తుతం ఆయన క్షణాల్లో దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆటవికంగా అత్యాచారాలకు, హత్యలకు పాల్పడిన వారిని ఎన్ కౌంటర్ చేయడం ఒక్కటే ప్రత్యామ్నాయమనే సందేశాన్ని ఇచ్చినట్టయింది.

Recommended Video

    Disha Issue : బ్రేకింగ్ : నిందితుల ఎన్ కౌంటర్... EXCLUSIVE ఎన్ కౌంటర్ వీడియో
    సీన్ రీకన్ స్ట్రక్షన్..

    సీన్ రీకన్ స్ట్రక్షన్..

    వెటర్నరి డాక్టర్ దిశపై లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పని చేస్తోన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు అత్యాచారానికి తెగబడిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను హత్య చేశారు. ఈ దారుణ ఉదంతానికి పాల్పడిన నలుగురు కామాంధులను పోలీసులను 24 గంటల్లోనే అరెస్టు చేశారు. పోలీసులు నిందితులను తీసుకు వెళ్లి సీన్‌ రీకన్‌ స్ట్రక్షన్‌ చేస్తుండగా... వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు దాడికి ప్రయత్నించారు. పోలీసులు కాల్పులు జరపడంతో నిందితులు అక్కడికక్కడే మరణించారు.

    యాసిడ్ దాడిలో

    యాసిడ్ దాడిలో

    ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఇద్దరు యువతులపై యాసిడ్ దాడి చోటు చేసుకున్న ఘటనలో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. 2008 డిసెంబర్ 10లో ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్‌‌‍ లోని కిట్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు వారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నస్వప్నిక తన న స్నేహితురాలు ప్రణీతతో కలిసిన స్కూటర్‌ పై ఇంటికి వెళుతుండగా శ్రీనివాస్ అనే యువకుడు యాసిడ్ దాడి చేశాడు.

     వరంగల్ శివార్లలో..

    వరంగల్ శివార్లలో..

    ఈ ఘటనలో గాయపడిన స్వప్నిక సికింద్రాబాద్‌లోని యశోదా అస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని స్వప్నిక మృతి చెందారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అదే సమయంలో వరంగల్ ఎస్పీగా ఉన్నది సజ్జన్నారే. ఇప్పుడు ఈ కేసు కూడా పర్యవేక్షించినది ఆయనే. ప్రస్తుతం ఆయన సైబరాబాద్ కమిషనర్ గా పని చేస్తున్నారు. మహిళలు, విద్యార్థినుల జోలికి వెళ్లిన వారికి ఎన్ కౌంటర్ తప్పదని ఆయన హెచ్చరించినట్టయింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+