ఐసీయూలోనూ పాటలు పాడిన గద్దర్: ఆ చివరి 12 గంటల్లో ఏం జరిగింది?

హైదరాబాద్: ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ ఇకలేరనే వార్త ఆయన కుటుంబసభ్యులతోపాటు కోట్లాది మంది అభిమానులను విషాదంలోకి నెట్టింది. తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గుండె ఆపరేషన్ తర్వాత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన గద్దర్.. క్షేమంగా తిరిగి వస్తారని అంతా భావించినా.. అందర్నీ శోకసంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన గద్దర్‌కు అపోలో ఆస్పత్రి వైద్యులు.. గుండెకు సంబంధించిన ఆపరేషన్ నిర్వహించారు. అంతా బాగానే ఉందని వైద్యులు, కుటుంబసభ్యులు భావించారు. అయితే, ఒక్కసారిగా గద్దర్ ప్రాణాలు కోల్పోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

These are the causes of Gaddar death: Apollo hospital doctors

ఈ క్రమంలోనే గద్దర్ మరణానికి కారణాలను వివరించారు అపోలో ఆస్పత్రి వైద్యులు. గుండె ఆపరేషన్ తర్వాత గద్దర్ కోలుకుంటున్నారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున ఆయనకు ఒక్కసారిగా బ్లడ్ ప్రెజర్(బీపీ) పెరిగింది. బీపీని కంట్రోల్ చేసే సమయంలోనే.. ఆయన షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గిపోయాయి. ఓ వైపు బీపీ పెరగడం.. మరో వైపు షుగర్ లెవల్స్ తగ్గడంతో చికిత్సకు స్పందించడం కష్టం మారిందని చెప్పారు.

గద్దర శరీరంలోని అవయవాలు చికిత్సకు స్పందించడం మానేశాయని తెలిపారు. కిడ్నీ, లివర్ పని చేయడం మందగించడంతో చివరి 12 గంటల్లోనే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో ఆదివారం మధ్యాహ్నం గద్దర్ తుది శ్వాస విడిచారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా, ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్న గద్దర్ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆయన కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు, ఉద్యమ నేతలు కన్నీటిపర్యంతమవుతున్నారు. గద్దర్ మరణం పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి చెబుతున్నారు.

ఐసీయూలోనూ పాటలు పాడిన గద్దర్

12 రోజుల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ నిమిత్తం అపోలో ఆస్పత్రిలో గద్దర్ చేరారని ఆయన అల్లుడు శ్రీకాంత్ తెలిపారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలోనూ గద్దర్ పాటలు పాడారని ఆయన తెలిపారు. ఆయన మరణం తమను తీవ్ర విషాదంలోకి నెట్టిందని తెలిపారు. కాగా, గద్దర్ మరణ వార్త తెలియడంతో వందలాది మంది అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఉద్యమ, ప్రజా సంఘాల నేతలు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకుని గద్దర్‌కు జోహార్లు అర్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+