Samantha: జ్వరంతో బాధపడుతున్న సమంత.. మిస్ యూ అంటూ ట్వీట్..
శాకుంతలం సినిమా విడుదలకు మందుకు సినీ నటి సమంత(Samantha) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సమంత గత కొద్ది రోజులుగా షూటింగ్స్, శాకుంతలం ప్రమోషన్సులో మునిగిపోయారు. ఆమెకు తాజాగా జ్వరం వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బుధవారం సాయంత్రం తాను శాకుంతలం ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం లేదని తెలిపారు.
"ఈ వారం అంతా నా సినిమాని ప్రమోట్ చేస్తూ, మీ ప్రేమలో మునిగితేలుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దురదృష్టవశాత్తూ తీవ్రమైన షెడ్యూల్‌లు, ప్రమోషన్ల వల్ల ఇబ్బంది పడ్డాను, నేను ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నాను. నా స్వరాన్ని కూడా కోల్పోయాను అని ట్వీట్ చేశారు. "ఈ రోజు సాయంత్రం ఎంఎల్‌ఆర్‌ఐటీలో జరగనున్న వార్షికోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనలేకపోతున్నా. మా టీమ్‌తో కలిసి మీరూ పాల్గొనండి. మీ అందర్నీ నేను మిస్ అవుతున్నా" అని రాసుకొచ్చారు సమంత.

(1/2)I was really excited to be amongst you all this week promoting my film and soaking in your love.
— Samantha (@Samanthaprabhu2) April 12, 2023
Unfortunately the hectic schedules and promotions have taken its toll, and I am down with a fever and have lost my voice.
ఈ సినిమాలో సామ్ శకుంతలగా నటించగా.. మలయాళీ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. భారీ బడ్జెట్‌తో ఎన్నో అంచనాల మధ్య నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచానాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం మయోసైటిస్‌కు గురైన సమంత గత కొన్ని నెలల నుంచి సినిమాలకు దూరంగా ఉండి. ఈ మధ్యే షూటింగ్ ల్లో పాల్గొంటున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications