Hyderabad: ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నారా.. అయితే మీకు అలర్ట్..
కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ ఆంక్షలు డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 వరకు కొనసాగనున్నాయి. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఇందుకు సంబంధించి సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 1న తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు అప్పర్ ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఖైరతాబాద్ కూడలి నుంచి ఫ్లైఓవర్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా నిరంకారి, రాజ్‌భవన్ వైపు కూడా వాహనాలను అనుమతించమని పోలీసులు తెలిపారు. బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తెలుగుతల్లి ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద ఇక్బాల్ మీనార్, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ వైపు పంపుతారు. హిమాయత్‌నగర్, లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను ఎగువ ట్యాంక్‌బండ్ వైపు రానివ్వరు.

వారు తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎడమ వైపు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనదారులు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద సెన్షెషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, లక్డీకాపూల్ వెళ్లాలని కోరారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ కూడలి, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ దేవాలయం, లెఫ్ట్ టర్న్ తీసుకొని అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు దిక్కు మళ్లించనున్నారు.
అలాగే పలు ఫ్లై ఓవర్లను కూడా మూసివేయనున్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్), శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి ఫ్లై ఓవర్, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌లు (1&2), షేక్‌పేట ఫ్లై ఓవర్, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్, ఫోరమ్ మాల్-JNTU ఫ్లై ఓవర్, రోడ్ నెం.45 ఫ్లై ఓవర్, దుర్గం చెరువు కేబుల్ వంతెన, సైబర్ టవర్ ఫ్లై ఓవర్ మూసివేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్‌పై వెళ్లేవారు విమానం టికెట్ చూపిస్తే ఎయిర్ పోర్టుకు అనుమతి ఇస్తారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!











Click it and Unblock the Notifications