వీరుల పాదాలకు ప్రణమం : పెళ్లి కార్డులో సైనికులకు వందనం, దేశభక్తిని చాటుకున్న బీడీఎల్ ఉద్యోగి
హైదరాబాద్ : జీవితంలో వివాహ ఘట్టం అనేది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వివాహం ఎవరి స్థాయిని బట్టి వారు అంతే ఘనంగా నిర్వహించుకుంటారు. బందుమిత్రుల సమక్షంలో కన్నుల పండుగగా పెళ్లి జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. పెళ్లి తంతులో వివాహ ఆహ్వాన పత్రాలు .. అదే వెడ్డింగ్ కార్డ్స్ కీలక పాత్ర పోషిస్తుంటాయి.
పెళ్లి ఆహ్వాన పత్రిక ను బట్టి వధూవరులు ఎంత స్థితిమంతులో అంచనా వేయవచ్చు. అంతే కాకుండా పెళ్లి పత్రిక ద్వారా వివాహం ఎంత ఆర్బాటంగా జరగబోతోందో ఇట్టే చెప్పెయొచ్చు. వివాహ ఘట్టంలో పెళ్లి కార్డులకు ఉన్న ప్రత్యేకత అది. మారుతున్న కాలంతో పాటు పెళ్లి పత్రికల్లో వస్తున్న సమాచారం కూడా మారుతోంది. ఇప్పటి వరకూ పెళ్లి పత్రికలో వధూవరులకు సంబంధించిన వివరాలు, వివాహం ఎక్కడ జరగబోతోంది, విందు ఎన్నింటికి, వధూవరుల కుటుంబ సభ్యుల పాక్షిక వివరాలు మాత్రమే ఉండేవి.
పెళ్లి ఆహ్వాన పత్రిక ను బట్టి వధూవరులు స్టేటస్ తెలిసిపోతోంది. అంతే కాకుండా పెళ్లి పత్రిక ద్వారా వివాహం ఎంత ఆర్బాటంగా జరగబోతోందో కూడా పసిగట్టొచ్చు. వివాహ ఘట్టంలో పెళ్లి కార్డులకు ఉన్న ప్రత్యేకత అది. ఇక మారుతున్న కాలంతో పాటు పెళ్లి పత్రికల్లో వస్తున్న సమాచారం కూడా మారుతోంది. ఇప్పటి వరకూ పెళ్లి పత్రికలో వధూవరులకు సంబందించిన వివరాలు, వివాహం ఎక్కడ జరగబోతోంది, విందు ఎన్నింటికి, వధూవరుల కుటుంబ సభ్యుల పాక్షిక వివరాలు మాత్రమే ఉండేవి.

ఇప్పుడు ఆ సంప్రదాయం మారుతోంది. సమాజంలో జరుగుతున్న వివిధ అంశాలను పెళ్లి పత్రికలో ముద్రించి తమ ఉన్నత స్వభావాన్ని చాటుకుంటున్నారు కొందరు. అంతే కాకుండా దేశం లో జరుగుతున్న పరిణామాలను, యుద్ద వాతావరణం, దేశ భక్తి తదితర అంశాలను కూడా పెళ్లి పత్రికలో ముద్రించేదుకు వధూవరులు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారానికి చెందిన బీడిఎల్ ఉద్యోగి రాణా ప్రతాప్ ముదిరాజ్ .. తన కూతురి వివాహం సందర్భంగా సైనికులను స్మరించుకున్నారు. జవాన్లను పెళ్లి పత్రికలో ప్రస్తావించారు. దేశం కోసం పోరాడుతున్న నా వీర సైనికుల పవిత్ర పాదాలకు ప్రణమిల్లుతూ అంటూ అందరికి స్వాగతం పలుకుతున్నట్టు పత్రికలో ముద్రించారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ రాణా ప్రతాప్ దేశ భక్తిని చూసి అభినందిస్తున్నారు. సరిహద్దులో దేశ భద్రత కోసం గస్తీగా ఉన్న సైనికులను పత్రికలో స్మరించి దేశభక్తిని చాటుకున్నామని శెభాష్ అంటున్నారు.












Click it and Unblock the Notifications