ఎండీ లేకుండానే ఎలా.. ఆర్టీసీ బస్సు టెండర్లపై సవాల్.. హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ : ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదనతో పాటు మరికొన్ని డిమాండ్లతో సమ్మె బాట పట్టారు కార్మికులు. ఆ క్రమంలో ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా డిపోల పరిధిలో కార్మికులు నిరసనలకు దిగుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ మేరకు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల టెండర్లపై మరో పిటిషన్ దాఖలు కావడం చర్చానీయాంశంగా మారింది.
ఆర్టీసీ బస్సుల టెండర్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆర్టీసీ కార్మిక సంఘ్ యూనియన్‌కు చెందిన కొందరు ప్రతినిధులు ఆ మేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. శాశ్వత ప్రతిపాదికన మేనేజింగ్ డైరెక్టర్ లేకుండా టెండర్లు ఎలా పిలుస్తారనేది వారి వాదన. ఆర్టీసీలో బోర్డు సమావేశాలు నిర్వహించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇన్‌ఛార్జ్ ఎండీ కొనసాగుతున్న తరుణంలో బస్సుల కోసం టెండర్లను పిలవడం చట్ట విరుద్దమని పిటిషనర్ల తరపు లాయర్ వాదించారు.

అదలావుంటే సమ్మె 18వ రోజుకు చేరినా.. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. సమ్మెపై ఎలాంటి విషయం తేల్చకుండా పర్మనెంట్ ప్రతిపాదికన అద్దె బస్సులు తీసుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆర్టీసీ తరపున వాదించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి ఆన్సర్ ఇచ్చారు. హైకోర్టు ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకే ఆర్టీసీ అధికారులు అద్దె బస్సులు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత బస్సులు నడిపే పరిస్థితి లేదని వివరించారు. అదలావుంటే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఇప్పటివరకు దాఖలైన పిటిషన్లపై ఈ నెల 28వ తేదీన మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications