నీచుడా.. ఏం పని.. బట్టలు మార్చుకుంటుండగా.. వీడియో తీసి
ఇటీవల షాపింగ్ మాల్‌లో పనిచేసే కొందరు తప్పుగా ప్రవర్తిస్తున్నారు. కెమెరాలు పెట్టడం ఒక ఎత్తు అయితే.. వీడియో తీయడం.. ఫోటోలు తీయడం చేస్తున్నారు. ఇలాంటి ఘనటలు దేశంలో కొకొల్లలు.. కానీ మన హైదరాబాద్‌లో కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఓ యువతీ అలా చూసి.. ఎదురించింది. వారిని పట్టుకొని.. పోలీసులకు అప్పగించింది. జూబ్లీహిల్స్‌లో జరిగిన ఘటన కలకలం రేపింది.

బట్టలు మార్చుకుంటుండగా..
ఓ మహిళ ట్రయల్ రూంలో బట్లలు మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు వీడియో తీశారు. అది గమనించి వారిని పోలీసులకు పట్టించింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ప్రముఖ బట్టల దుకాణం హెచ్ అండ్ ఎంలో మహిళ బట్టలు కొనటానికి వచ్చింది. నచ్చిన డ్రస్ తీసుకుని దాన్ని చెక్ చేసుకోటానికి ట్రయల్ రూమ్‌లోకి వెళ్లింది. వేసుకుని చూసుకుంటుండగా పక్కనే ఉన్న ట్రయల్ రూం లోంచి సెల్ ఫోన్ ద్వారా తనను వీడియో తీస్తున్నట్లు గుర్తించింది. ఆమె వెంటనే అలర్ట్ అయ్యింది.

ఇద్దరు యువకులు
బయటకు వచ్చి పక్కనే ఉన్న ట్రయల్ రూంలోని ఇద్దరు యువకులను పట్టుకుని షాపు మేనేజర్ కు అప్పగించింది. పోలీసులకు సమాచారం అందజేసింది. కొద్ది నిమిషాల్లోనే షోరూంకు చేరుకున్న పోలీసులు వీడియో తీసిన ఇద్దరు యువకులను, షోరూం మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీడియో తీసిన సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని తదుపరి విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. ఇదేనా.. ఇంకేవరినైనా ఇలా వేధించారా అనే అంశానికి సంబంధించి విచారణలో తెలియనుంది.
Recommended Video

వీడియో తీసి..
ఈ ఘటన మాత్రం కలకలం రేపింది. ఆమె చూసింది కాబట్టి ఇబ్బంది లేదు. అయితే చూడకుంటే.. వీడియో తీసేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఆమె జీవితంతో ఆడుకునేవారు. సో ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మరికొందరు. రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఎన్ని కఠిన చట్టాలు వస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. అందువల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఇన్సిడెంట్‌కు సంబంధించి మేనేజర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతనిని శిక్షిస్తే గానీ.. వారి వద్ద పనిచేసే వారికి బుద్ది వచ్చే అవకాశం ఉంటుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications