దండం బాబూ.. షాష్టంగ నమస్కారాలు, పెట్రో ధరలపై జనం ఎక్స్‌ప్రెషన్స్.. వైరల్
పెట్రో ఉత్పత్తులు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధర పెరుగుతూనే ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో సామాన్యుడు వెహికిల్ వాడాల్సి వస్తోంది. లేదంటే లీటర్ పెట్రోల్ రూ.100 కావడం ఏంటీ.. దీనిపై నెటిజన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెట్రోల్ బంకుల వద్ద ప్రధాని మోడీ ఫోటో ఉండగా.. జనం ఒక్కొక్కొరు ఒకలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దండం బాబు..
పెట్రో ధర ఎగబాకిన నేపథ్యంలో ఓ యువతి మోడీ ఫోటోకు దండం పెడుతున్నారు. బాబ్బాబు.. ఏందీ ఈ ధర అనేలా ఆమె వెర్షన్. ఇకచాలు అని అంటున్నారు. మరొ ఫోటోలో అయితే షర్ట్ విప్పి మరీ తన నిరసన వ్యక్తం చేశారు. వాహనాల్లో తిరగమంటావా.. లేదంటే వద్దా అని అడిగారు. ఇంకొకరు అయితే మరో అడుగు ముందుకేశారు. మోడీ ఫోటో ఉన్న చోట షాష్టంగా నమస్కారం చేశారు. ఇలా ఎవరికీ వారు తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

బుల్లెట్ బాబు ఇలా
బుల్లెట్ బాబు అయితే రెండు చేతులు పైకి ఎత్తిమరీ నమస్కరించారు. మరో బుల్లెట్ బాబు అయితే బండి మీద ఉండి నమస్కరించారు. వీరిద్దరూ తమ వాహనంలో పెట్రోల్ పోస్తున్న పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో కొందరు జీరో నుంచి అలా చీట్ చేస్తారు. అందుకోసమే ఇలాంటి విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది. ట్రాక్టర్‌పై వచ్చిన ఒకతను కూడా దణ్ణం పెట్టాడు.

కళ్ల కింద చేయి.. ఏడుస్తున్నడా ఏందీ..?
టూవీలర్ అయితే కళ్ల కింద చేయి పెట్టుకొని ఏడ్చినంత పనిచేశారు. మరొ బాబు అయితే తలకు చేయి పెట్టాడు. అమ్మ బాబొయ్ ఇవేం ధరలు అనేలా.. మరొకరు అయితే సైకిల్‌పై వచ్చి.. తలకు చేయిపట్టి నిరసన తెలిపాడు. పెట్రో ధరలా అంటూ అర్థం వచ్చేలా అతని ప్రవర్తన ఉంది. ఇలా ఒక్కొక్కరు ఒకలా తమ ఎక్స్ ప్రెషేషన్స్ పెట్టి బిహెవ్ చేశారు.
హావభావాలు..
పెట్రో, డీజిల్ ధరల పెంపుతో జనం తమదైన శైలిలో హవభావాలను ప్రదర్శించారు. ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై వాహనదారులు గుర్రు మీదున్నారు. ఎన్నికల సమయంలోనే ధరలు తగ్గిస్తారా..? తర్వాత ఇంతేనా అని అడుగుతున్నారు.












Click it and Unblock the Notifications