హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Ugadi: విశిష్టత.. శుభకృత్‌లో అంతా మంచే.. పండితులు ఏం చెబుతున్నారంటే..

|
Google Oneindia TeluguNews

ఉగాది.. తెలుగు వారి కొత్త సంవత్సరం. తెలుగు నామ సంవత్సరం ఉగాదితోనే ప్రారంభం అవుతుంది. జనవరి 1వ తేదీ పాశ్చాత్య దేశాల ఒరవడి.. దానికి ఉగాది మాత్రం తెలుగు సంవత్సరాది. చైత్ర శుక్ల పాడ్యమి అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుప బడుతుందని పురాణాలు చెబుతున్నాయి.

తెలుగు సంవత్సరాది..

తెలుగు సంవత్సరాది..

ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది.. తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభిస్తే మంచి జరుగుతుంది. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.

షడ్రుచుల సమ్మేళనం

షడ్రుచుల సమ్మేళనం


షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. పచ్చడి కోసం చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఉగాదిని మరాఠలో గుడిపడ్వాగా పిలుస్తారు.

ఒక్కో చోట ఒకలా..

ఒక్కో చోట ఒకలా..


హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఉగాది.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా'.. మలయాళీలు "విషు" అని.. సిక్కులు "వైశాఖీ".. బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గా జరుపుకుంటారు. పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును.

శుభకృత్ నామ సంవత్సరం

శుభకృత్ నామ సంవత్సరం

ఈ ఏడాది శ్రీ శుభకృత్ నామ సంవత్సరం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరంలో గ్రహాల స్ధితిగతులను ఆధారంగా జ్యోతిష్యులు రాశిఫలాలను రచిస్తారు. సంవత్సరంలో మంచి చెడులను, ఆదాయ ఫలాయాలను, స్ధూలంగా తమ భావిజీవిత క్రమం తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తారు.

English summary
Ugadi: festival importance and significance. this year come on the name of shubakrut nama year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X