Valentine's Day రచ్చ షురూ: పోలీసులు అలెర్ట్; ప్రైవేట్ బౌన్సర్లు కూడా.. ప్రేమికులు జాగ్రత్త!!
వాలెంటైన్స్ డే బహిష్కరణకు పిలుపునిచ్చిన పలు సంస్థలు ప్రేమ జంటలు కనిపిస్తే కౌన్సిలింగ్ ఇస్తామని తేల్చి చెబుతున్నాయి. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
వాలెంటైన్స్ డే.. ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకునే రోజు. అయితే ప్రతిసారి వాలెంటైన్స్ డే సందర్భంగా బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్తులు వాలెంటైన్స్ డే ని బహిష్కరిస్తూ, ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామని హెచ్చరిస్తూ హల్చల్ చేసే విషయం తెలిసిందే. ఇక ఈ సంవత్సరం కూడా వాలెంటైన్స్ డే బహిష్కరణకు పిలుపునిచ్చిన పలు సంస్థలు ప్రేమ జంటలు కనిపిస్తే కౌన్సిలింగ్ ఇస్తామని తేల్చి చెబుతున్నాయి. ఇక పార్కులలోనూ, హోటళ్ళలోనూ జంటలు కనిపిస్తే రచ్చ చెయ్యటానికి రెడీ అయ్యాయి. ప్రేమికుల రోజు జరుపుకోవటం మన సంస్కృతి కాదని పదేపదే తేల్చి చెప్తున్న పలు సంస్థలు చాలా కాలంగా ప్రేమికులరోజు నాడు దొరికిన జంటలకు కౌన్సిలింగ్ ఇస్తూ, పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నాయి.

వాలంటైన్స్ డే బహిష్కరణ పిలుపు.. అలెర్ట్ అయిన పోలీసులు
ఇక గతంలో పార్కులలోను, హోటల్స్, రెస్టారెంట్లలో, పబ్బులు, క్లబ్బులలోనూ ప్రేమ జంటలు ఎక్కడ కనిపించినా టార్గెట్ చేసిన సంస్థల తీరుతో, తాజాగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నేడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేమికులు తిరిగే అన్ని ప్రాంతాలలోనూ గస్తీని ముమ్మరం చేశారు. ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ప్రైవేట్ బౌన్సర్ లను ఏర్పాటు చేసుకున్న హోటళ్ళు, రెస్టారెంట్ ల యజమానులు
ఇదిలా ఉంటే నగరంలోని హోటళ్ళు, రెస్టారెంట్లు, పబ్ లు, క్లబ్ ల యజమానులు ప్రేమికుల రోజును వ్యతిరేకించేవారు తమ హోటళ్ళు, రెస్టారెంట్లపై దాడులు చేయకుండా అడ్డుకోవడం కోసం ప్రైవేట్ బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని జోన్లలో ముఖ్యంగా పశ్చిమ మండలంలో ఎక్కువగా పబ్లు, రెస్టారెంట్లు, మాల్స్ ఉన్నాయి. దీంతో పోలీసు అధికారులు ఈ ప్రాంతంపై నిఘా పెట్టారు. అన్ని పార్కుల వద్ద, రెస్టారెంట్లు, మాల్స్ వద్ద భారీగా పోలీసులను కాపలాగా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

స్పెషల్ డే గా వాలంటైన్స్ డే.. ప్రేమికుల తహతహ
ఇదిలా ఉంటే మరొకపక్క వాలెంటైన్స్ డే ను సరికొత్తగా జరుపుకోవాలని, స్పెషల్ డే గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రేమికులు తహతలాడుతున్నారు. వాలంటైన్స్ డే గిఫ్ట్ ల కోసం కొత్త కొత్త ఆలోచనలతో షాపింగ్ చేస్తున్నారు. ఏడాదంతా వాడిపోని గులాబీలతో ప్రేమను వ్యక్తం చెయ్యటానికి ప్రేమ పక్షులు రెడీ అవుతున్నారు. ఇంకోపక్క ఇదే అదునుగా హోటల్స్ లో స్పెషల్ మెనూలు కూడా వాలెంటైన్స్ డే స్పెషల్ గా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని హోటల్స్ వాలెంటైన్స్ డే రోజు ప్రత్యేకమైన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి. మూన్ లైట్ డిన్నర్ లను ఏర్పాటు చేస్తున్నాయి. క్యాండిల్ లైట్ డిన్నర్ లు, మ్యూజిక్, స్పెషల్ వంటకాలతో రెడీ అయ్యాయి.

ప్రేమికులు జర భద్రం
ఒకపక్క ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకోవాలని ప్రేమికులంతా రెడీ అవుతుంటే, అసలు మన సంస్కృతి కాని దానిని మనం పాటించటం తప్పని, అడ్డుకుని తీరుతామని బజరంగ్ దళ్ వంటి సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడ్డం కోసం పోలీసులు పహార కాస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల పహారా, పలు సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ప్రేమికులు జరభద్రం..
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications