వివాహాల రిజిస్ట్రేషన్ మరింత సులభతరం..! మీ స్మార్ట్‌ఫోన్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం..!
Recommended Video

హైదరాబాద్ : కొత్తగా వివాహం చేసుకోబోయే జంటలకు ప్రభుత్వ అదికారులు తీపి కబురు వినిపిస్తున్నారు. వివాహాల రిజిస్ట్రేషన్ కోసం సంబందిత కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఇక మీదట ఉండదు. స్మార్ట్ ఫోన్ లోనే వివాహానికి సంబందించిన వివరాలను పొందు పరిచి డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యానికి అదికారులు శ్రీకారం చుట్టారు. దీంతో ఎంతో కాలంగా పొందలేని వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను క్షణాల్లో పొందొచ్చు. ఇక మీ స్మార్ట్ ఫోన్ యాప్ లో వివరాలను పొందుపరచడమే తరువాయి సర్టిఫికేట్ మీ ఫోన్ లో ప్రత్యక్షం అవుతుంది.

అన్ని సౌకర్యాలు ఇక మీదట స్మార్ట్ ఫోన్ లోనే..! వివాహ సర్టిఫికేట్లు కూడా..!!
తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ప్రజలకు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పలు సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీ-రిజిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక యాప్‌ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నది. ఇప్పటికే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు మ్యారేజ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన యాప్‌ను అధికారికంగా గూగుల్ ప్లేస్టోర్‌లో నిక్షిప్తంచేశారు అదికారులు.

ఆన్ లైని వివాహాల రిజిస్ట్రేషన్ అందుబాటులోకి..! సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం..!
అదేవిధంగా చలానాలు, సర్టిఫికెట్ల వివరాలను కూడా కొద్దిరోజుల్లోనే యాప్ రూపంలో అందుబాటులోకి తేనున్నారు. హిందూ వివాహాల చట్టం ప్రకారం జరిగే వివాహాల రిజిస్ట్రేషన్ మరింత పకడ్బందీగా అమలుచేయడానికి ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆన్‌లైన్ ప్రక్రియ ఆశించిన ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో గత నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆన్‌లైన్ వివాహాల రిజిస్ట్రేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

వివాహ రిజిస్ట్రేషన్ తో పాటు మరికొన్న యాప్ లు..! త్వరలో అందుబాటులోకి..!
వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకొనే దంపతులు ముందుగా స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత సమయానికి సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి సర్టిఫికెట్ పొందవచ్చు. స్థిరాస్తి రిజిస్ట్రేషన్, పాస్‌పోర్ట్ తరహాలోనే ఆన్‌లైన్‌లో ఫొటోలు తీసుకొని పక్కాగా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియను కంప్యూటర్‌లో నిక్షిప్తంచేస్తారు. సంబంధిత వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా సమాచారం తీసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని సర్టిఫికెట్ పొందవచ్చు.

యాప్ పై అవగాహన కోసం సిబ్బందికి శిక్షణ..! మరి కొద్ది రోజుల్లో మీ ఫోన్ లో ప్రత్యక్షం..!!
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఈ యాప్ ప్రయోగం విజయవంతమవడంతో అన్ని జిల్లాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. ఈ యాప్ లో ఇకపై స్టాంపులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే సమస్త సమాచారాన్ని నిక్షిప్తంచేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్ చిరంజీవులు నిర్ణయించారు. తొలుత చలానాల వివరాలను నిక్షిప్తంచేయనున్నారు. ఈ యాప్ ద్వారా భూముల మార్కెట్ విలువ తెలుసుకోవడం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పొందటం వంటి సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు. ఈ యాప్ పనితీరుపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చి సిద్ధంచేశారు అదికారులు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications