Hyderabad: నత్తనడకన జూ పార్క్, ఆరామ్‌ఘర్ ఫ్లైఓవర్ నిర్మాణం..
జూ పార్క్, ఆరామ్‌ఘర్ ఫ్లైఓవర్ నిర్మాణం నత్తనడక కొనసాగుతోంది.
హైదరాబాద్‌లోని జూ పార్క్ నుంచి ఆరామ్‌ఘర్ వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణం నత్తనడకన కొనసాగుతోంది. ఇది పూర్తి కావడానికి మరో సంవత్సరం పడుతుందని అంచనా వేస్తున్నారు. నిజానికి మార్చి 2023 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం కానీ పనులు నెమ్మదిగా సాగుతుండడంతో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
గతంలో ఈ ప్రాజెక్టును సులభతరం చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఆ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది. అయితే శివరాంపల్లిలోని ఇరుకైన ప్రాంతంలో రోడ్లు, గుంతలు దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

రూ.636.80 కోట్లు
అంతేకాకుండా, ప్రస్తుతం జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా దెబ్బతిన్న రహదారితో వాహనదారులు ఇబ్బంది పడుతన్నారు. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గడంతో పాటు జూ పార్క్ నుంచి ఆరామ్‌ఘర్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా రూ.636.80 కోట్లు అంచనా వ్యయంతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మిస్తున్నారు. 119 స్తంభాలపై దీన్ని 4.08 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మిస్తున్నారు.

నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే
ఇది పూర్తయితే, మెహదీపట్నంలోని హైదరాబాద్ విమానాశ్రయాన్ని కలిపే పివి నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే తర్వాత హైదరాబాద్‌లో రెండవ పొడవైన ఫ్లైఓవర్ అవుతుంది. అంతకాకుండా ఆరు లేన్ల ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంతో జూ పార్క్, పాతబస్తీ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరుకు రాకపోకలు సాఫీగా సాగుతాయి.
2023 మార్చి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. అయితే, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నందున సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

కొత్తగూడ ఫ్లై ఓవర్
గత ఏడాది హైదరాబాద్‌లోని బొటానికల్ గార్డెన్ జంక్షన్‌లో కొత్తగూడ మల్టీ లెవల్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతకుముందు శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు.
రెండు ఫ్లై ఓవర్లు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించాయి. గత సంవత్సరం, హైదరాబాద్‌లో అనేక ఫ్లైఓవర్‌లను ప్రారంభించారు. వాటిలో కొత్తగూడ ఫ్లై ఓవర్, శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్, నాగోల్ ఫ్లై ఓవర్, చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్, కైతలాపూర్ ఫ్లై ఓవర్, బహదూర్‌పురా ఫ్లైఓవర్ ఉన్నాయి.












Click it and Unblock the Notifications