సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు: నేతాజీ యువతకు ఆదర్శం: ఐఎన్ఏ ట్రస్టు
భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం కంటే ముందు నాటి స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలను జరుపుకుంటోంది. పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన సుభాష్ చంద్రబోస్ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా బ్రిటీషు వారిని ధీటుగా ఎదుర్కొన్నాడు. వారిని ముప్పుతిప్పలు పెట్టడమే కాదు.. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి బ్రిటీషు వారిపై తిరుగుబాటు చేశాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను ఐఎన్‌ఏ ట్రస్టు గౌరవించింది. యువతలో జాతీయ భావం పెంపొందించడం, బోస్ చేసిన పోరాటపటిమను గుర్తు చేయడం, దేశభక్తిని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టింది. జాతీయ భావం యువతలో మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఐఎన్‌ఏ ట్రస్టు భావిస్తోంది.
ఈ కార్యక్రమంలో బోస్ ధైర్యం, దేశం పట్ల తనకున్న అంకితభావం, బ్రిటీషు వారిని ఎదరించడంలో ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలను గురించి ఈ కార్యక్రమంలో చర్చించారు. ఐఎన్ఏ ట్రస్టు వైస్ ఛైర్మెన్ రాజ్‌పుత్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలకంగా వ్యవహరించిన సంగతి దేశంలోని అతితక్కువ మందికి తెలుసని రాజ్‌పుత్ అన్నారు. బోస్ జీవితం గురించి తాను స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి ధైర్య సాహసాలను ప్రదర్శించారో దేశ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంను ఏర్పాటు చేసినట్లు రాజ్‌పుత్ తెలిపారు. యువత నేతాజీ చంద్రబోస్ నుంచి చాలా నేర్చుకోవాలని రాజ్‌పుత్ అన్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని ఈ మంచి కార్యక్రమంకు తనను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు ఇన్వెస్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ హిందల్ సేన్ గుప్తా. తాను స్వామి వివేకానందతో నేతాజా సుభాష్ చంద్రబోస్‌ను పోల్చి చూస్తున్నట్లు హిందల్ సేన్ గుప్తా చెప్పారు. ఈ ఇద్దరూ లెజండరీలు భారత దేశ చరిత్రతో ముడిపడి ఉన్నారని చెప్పారు. ఇక సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన అంశాలను విషయాలు మరుగున పడకూడదనే ఉద్దేశంతోనే ఐఎన్ఏ ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది. యువతకు సుభాష్ చంద్రబోస్ జీవిత విషయాలను చెప్పడం ద్వారా ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉండేలా చూడొచ్చని ట్రస్టు భావిస్తోంది.












Click it and Unblock the Notifications