వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 మంది మృతి.. ముగ్గురు చిన్నారులు సహా.. కూలిన గోడ.. ఎక్కడ అంటే..

|
Google Oneindia TeluguNews

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బిలోని ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలింది. ఘటనలో 12 మంది చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అకస్మాత్తుగా గోడ కూలడంతో కూలీలు తప్పించుకునే వీలు లేకుండా పోయింది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారనే అనుమానంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని గుజరాత్ మంత్రి బ్రిజేష్ మీర్జా తెలిపారు. స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.

ఉప్పు ఫ్యాక్టరీ హల్వాద్ టౌన్ సమీపంలో ఉంది. ప్రమాదం మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. ఆ గోడ 15 నుంచి 20 ఫీట్ల వరకు ఉంటుంది. ప్రమాదం జరిగే సమయంలో అక్కడ 13 మంది ఉన్నారు. శిథిలాలు పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. 12 మంది సహాయక చర్యలు చేపట్టే వరకు చనిపోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

12, including three children, killed as wall collapses in Gujarat Morbi

ప్రమాదం జరిగే సమయంలో కార్మికులు ఉప్పును ప్యాక్ చేస్తున్నారు. ఒక్కసారిగా గోడ కూలడంతో.. వారికి తప్పించుకునే వీలు లేకుండా పోయింది. చనిపోయిన వారిలో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళా కూలీలు ఉన్నారు. కార్మికుల స్వస్థలం కచ్ అని.. వారి పనికోసం హల్వద్ వచ్చారని తెలిపారు. పరిస్థితిని సమీక్షించడానికి సీఎం భూపేంద్ర పాటిల్ హల్వాద్ వచ్చారు. అతనితోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ కే కైలాశనాథన్, కార్మికశాఖ మంత్రి బ్రిజేశ్ మెర్జా కూడా ఉన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసాను ఇచ్చారు.

English summary
12 people, including three children, were killed and another was injured after a section of a wall in a salt processing plant near Halvad town in Gujarat’s Morbi district collapsed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X