‘పరప్పన’లో అక్రమాలు నిజమేనా? పెండింగులో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నివేదిక!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: పరప్పన అగ్రహార కారాగారంలో అక్రమాలు జరిగాయని సీనియరు పోలీసు అధికారిణి రూపా మౌడ్గిల్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి వినయ్ కుమార్‌ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

వారం కిందటే ఆయన తన నివేదికనుహోంశాఖకు అందించినా- శాసనసభ సమావేశాల నేపథ్యంలో అందులోని అంశాలు బయటికి రాకుండా కాపాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

శశికళ, ఆమె వదిన ఇళవరసి ఉండేందుకు పరప్పన అగ్రహారం జైల్లో ఐదు గదులు, వారు ఏ పనీ చేయకుండా.. కావలసిన చోటికి తిరిగేందుకు అవకాశం ఇవ్వటం, అతిథులతో గంటల తరబడి ముచ్చటించుకునేందుకు ఏకాంతం కల్పించటం, బయటి నుంచి తీసుకు వచ్చే ఆహారాన్ని అనుమతించటం తదితర అంశాలపై వినయ్ కుమార్‌ దర్యాప్తు చేశారు.

2K-page probe report on jail irregularities submitted to Karnataka govt

నకిలీ స్టాంపు కాగితాల కేసు నిందితుడు కరీంలాలా తెల్గీ కారాగారంలో ఉన్న సమయంలో అతనికి మర్దన చేసేందుకు ఒక సహాయకుడిని అందించేందుకు కూడా కారాగారంలోని అధికారులు ముడుపులు తీసుకున్నారని కుమార్‌ తన నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.

కారాగారంలో ఒక ఖైదీ అక్కడి వైద్యాలయంలోని వైద్యునిపై దాడి చేసిన ఘటనను కూడా భద్రతా సిబ్బంది తీవ్రంగా పరిగణించలేదని వినయ్ కుమార్‌ దర్యాప్తులో తేలినట్లు తెలిసింది.

విశ్రాంత ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నివేదికపై హోంశాఖకు చెందిన కొంతమంది అధికారులు లీకులిచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఆ నివేదికను తామింకా పరిశీలించలేదని హోం మంత్రి రామలింగారెడ్డి మంగళవారం ఇక్కడ తనను కలుసుకున్న విలేకరులకు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Retired IAS officer Vinay Kumar has submitted a report to the state government on the alleged special treatment meted out to expelled AIADMK leader V K Sasikala and other "erroneous" practices at Bengaluru Central Prisons at Parappana Agrahara.Kumar met chief secretary Subhash Chandra Khuntia on October 21 and submitted a 2000-page enquiry report."I collected information, questioned several people and finalised the report," he told DH. However, he, refused to divulge details of the report and said that authorities concerned would act on the report.Kumar was appointed by the sate government to conduct an enquiry after IPS officer D Roopa highlighted in a report the alleged special privileges given to Sasikala and others inside central jail.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి