బెంగళూరు రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం: ఐదుగురు మృతి

Subscribe to Oneindia Telugu
  Bengaluru Fire : బెంగళూరు రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం, వీడియో !

  బెంగళూరు: నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్కే మార్కెంట్‌లోని కైలాశ్ బార్‌ అండ్ రెస్టారెంట్‌లో చోటు చేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.

  కుంబారా సంఘా భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న ఈ బార్‌‌లో సోమవారం తెల్లవారుజామున 2.30గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను ఆర్పేశారు.

  5 dead after fire breaks out at bar in Bengaluru

  బార్‌లోనే నిద్రిస్తున్న ఐదుగురు సిబ్బంది మృతి చెందారని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మృతుల్లో స్వామి(23) తమకూరు, ప్రసాద్(20)తమకూరు, మంజునాథ్(45)హసన్, కీర్తి(24) మాండ్య, మహేష్(35)తమకూరు) ఉన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Five persons have died in Bengaluru after a fire broke out at the K R Market. The fire was reported at the Kailash bar at K R Market in Bengaluru.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి