యూపీలో బిజెపి ఓటమికి కారణలివే: అతిక్, ఎస్పీ, బిఎస్పీ కొంప ముంచిందా?

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో:గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో మూడు దశాబ్దాల పాటు తిరుగులేని అధిపత్యం చలాయించిన బిజెపికి ఉప ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవిచూసింది.గోరఖ్ పూర్ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్ధికి బిఎస్పీ మద్దతిచ్చింది. ఈ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్ధి ఘన విజయం సాధించారు. బిఎస్పీ, ఎస్పీల పొత్తు యూపీలో కలిసొచ్చింది.

దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తూ వస్తోంది. అయితే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు లోక్‌సభ స్థానాల్లో బిజెపి ఓటమి పాలైంది.యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహించిన గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానంలో ఓటమి పాలు కావడం బిజెపికి కోలుకోలేని దెబ్బతింది.

అయితే ఈ ఓటమిని బిజెపి ఒప్పుకొంది. అతి విశ్వాసమే ఈ ఎన్నికల్లో ఓటమికి కారణమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఈ ఫలితాలు ఎస్పీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపాయి.

 గోరఖ్‌పూర్‌లో బిజెపి ఓటమికి కారణలివే

గోరఖ్‌పూర్‌లో బిజెపి ఓటమికి కారణలివే

గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు దశాబ్దాల పాటు తిరుగులేని అధిపత్యం చలాయించిన బిజెపికి ఘోర పరాజయం పాలైంది. ఎస్పీ, బిఎస్పీల పొత్తు బిజెపి ఓటమికి కారణమైంది. గోరఖ్ పూర్ పార్లమెంట్ స్థానంలో 19.5 లక్షల ఓటర్లున్నారు. ఇందులో 4.5 లక్షల నిషద్‌లు, మల్లాల ఓట్లున్నాయి గోరఖ్‌పూర్‌లో ఈ రెండు వర్గాల ఓట్లు సుమారు 23 శాతం వరకు ఉంటారు. ఏ పార్టీ అభ్యర్ధి గెలుపు ఓటముల్లో ఈ 23 శాతం ఓట్లు కీలక ప్రభావం చూపుతారని రాజకీయ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.

ఎస్పీ, బిఎస్పీల పొత్తు బిజెపిని దెబ్బతీసింది

ఎస్పీ, బిఎస్పీల పొత్తు బిజెపిని దెబ్బతీసింది

గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో సుమారు 3.5 లక్షల ముస్లిం ఓటర్లున్నారు. దళితుల ఓట్లు సుమారు 3.5 ఓట్లు ఉంటాయి. ఎస్పీ, బిఎస్పీల పొత్తు కారణంగా ఎస్పీ, బిఎస్పీ చేతులు కలపడంతో ఈ ఓట్ల చీలికను నివారించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓట్ల చీలిక కాకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.

 అతిఖ్ అహ్మద్‌ను బిజెపి అతిగా నమ్ముకొందా

అతిఖ్ అహ్మద్‌ను బిజెపి అతిగా నమ్ముకొందా

ఫుల్పూర్‌లో పార్లమెంట్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి అతీక్ అహ్మద్‌పై బిజెపి ఆశలు పెట్టుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతీక్‌ను అతిగా నమ్ముకోవడమే బిజెపి నమ్ముకొందనే అభిప్రాయపడ్డారు. ఎస్పీకి ముస్లిం ఓట్లు దక్కకుండా చీల్చగలిగితే తమకు లాభిస్తుందని బిజెపి భావించింది. కానీ, ముస్లిం ఓట్లు చీలకుండా ఎస్పీ, బిఎస్పీల పొత్తు కలిసొచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 50 శాతం దళితుల ఓట్లు ఎస్పీకి పడతాయని బీజేపీ పసిగట్టింది. ముస్లిం ఓటర్లు మాత్రం ఎస్పీ అభ్యర్థి నాగేంద్రపటేల్‌కు కాకుండా అహ్మద్‌కే ఓటు వేస్తారని బీజేపీ ఆశలు పెట్టుకుంది.కానీ ఎస్పీకే ఓట్లు పడ్డాయి. బిఎస్పీతో పొత్తు కలిసొచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 అలహబాద్‌ పశ్చిమలో అతీక్‌కు పట్టుంది

అలహబాద్‌ పశ్చిమలో అతీక్‌కు పట్టుంది

జైలు నుంచే ఫుల్పూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా అతిక్ పోటీ చేశారు. ఇక్కడ ముస్లింలకు మొత్తం 2.5 లక్షల ఓట్లు ఉన్నాయి. గ్రామాల్లో అతీక్‌కు అంత గుర్తింపు లేదు. అలహాబాద్ వెస్ట్ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. అతిక్ కారణంగా ఎస్పీ ఓటమి పాలైంది. తాజాగా బీఎస్పీతో చేతులు కలిపి ఆపార్టీ ఓట్లు మొత్తం తన అభ్యర్థి వైపు తిప్పుకుంది.బిజెపి ప్లాన్ వర్కవుట్ కాలేదు. కానీ, బిఎస్పీ, ఎస్పీ పొత్తు ఈ ఉప ఎన్నికల్లో కలిసొచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gorakhpur, the Uttar Pradesh parliament seat that Yogi Adityanath represented as a BJP lawmaker for two decades before vacating it last year to take over as Chief Minister, has chosen the Samajwadi Party this time. The Samajwadi Party, backed in a rare arrangement by Mayawati's Bahujan Samaj Party, is also set to win the by-election in Phulpur, the seat vacated by Yogi Adityanath's deputy Keshav Prasad Maurya.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి