కొలిక్కి వచ్చిన మహా వికాస్ అఘాడీ సీట్ల లెక్క-ఒక్కో పార్టీకి ఎన్నీ సీట్లో తెలుసా ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో సీట్ల పంపకాలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. గత లోక్ సభ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిపై ఆధిక్యం అందుకున్న విపక్ష కూటమి అదే జోరులో అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. అయితే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అదే ఫార్ములాలో సీట్లు కావాలని పట్టుబట్టింది. కానీ స్థానికంగా పట్టున్న తమకూ ఎక్కువ సీట్లు కావాలని శివసేన యూబీటీ కూడా పట్టుదలకు పోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. అయితే సుదీర్ఘ చర్చల తర్వాత ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది.
మహారాష్ట్రలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలూ తలో 85 శాతం సీట్లు తీసుకోవాలని తాజాగా నిర్ణయించాయి. అఘాడీ కూటమికి పెద్ద దిక్కు అయిన శరద్ పవార్ కాంగ్రెస్, శివసేన పార్టీల్ని కూర్చోబెట్టి ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన మహారాష్ట్ర పీసీసీ ఛీఫ్ నానా పటోలే, శివసేన నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ ఎస్పీ నేత జయంత్ పాటిల్ తో జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఒక్కో పార్టీ నుంచి 85 మంది పోటీ చేయబోతున్నారు. అలాగే మిత్రపక్షాలుగా ఉన్న చిన్న పార్టీలకు మరో 18 సీట్లు ఇస్తున్నారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా 15 కీలక సీట్లపై మాత్రం ఎటూ తేల్చలేదు. ఇందులో ముంబైలో 3, విదర్భలో 12 సీట్లు ఉన్నాయి.వీటిలో పోటీ కోసం కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిపై త్వరలో మరో దఫా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు తీసుకోవాలని భావించింది. అయితే తాజా ఫార్ములా ప్రకారం ఆ పార్టీ 15 సీట్లు కోల్పోయింది. మరోవైపు 15 సీట్ల వివాదం తేలకపోతే మాత్రం కాంగ్రెస్ కు మరిన్ని దెబ్బలు తప్పకపోవచ్చు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications