ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్ .. మ్యాప్ ను అనుసరించి డ్యామ్ లో పడిపోయిన కారు , ఒకరు మృతి
ఎవరైనా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు వారు వెళ్లాల్సిన గమ్యస్థానాలకు చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగిస్తున్నారు. అయితే అన్ని సందర్భాలలో గూగుల్ మ్యాప్స్ గమ్యస్థానాలకు చేర్చే మార్గాలను క్లియర్ గా చూపించడం లేదు. గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని ప్రయాణం సాగించి దారి లేకుండా చెరువు కట్టలమీద, వాగు దగ్గర కార్ల ను ఆపి అక్కడ వారినడిగి తిరిగి రూట్లను కనుక్కొని ప్రయాణం చేసిన వారు కూడా లేకపోలేదు.

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో అకోలే పట్టణంలో ఘటన
అయితే గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని ప్రయాణం చేసిన వారు ఏకంగా డ్యామ్ లో పడిపోయిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు బయటపడ్డారు.
గమ్యస్థానాలకు కనుక్కోవడం కోసం గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించడం ఈరోజుల్లో సర్వసాధారణంగా మారినప్పటికీ, మ్యాప్ లో సూచనలను గుడ్డిగా అనుసరించడం ప్రాణాంతకమని అనేక ఘటనలు నిరూపించాయి. అలాంటి ఒక సంఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో అకోలే పట్టణంలో చోటు చేసుకుంది.

గూగుల్ మ్యాప్స్ ను అనుసరించి డ్యాం లోకి దూసుకెళ్లిన కారు
గూగుల్ మ్యాప్ లో ఉన్న ఆదేశాలను పాటిస్తూ ప్రయాణం సాగించిన ఓ వ్యక్తి వాహనాన్ని డైరెక్టర్ డామ్ లోకి దింపేసాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే వాహనం నీళ్ళల్లో మునిగి పోయింది.
సతీష్ గులే అనే వ్యక్తి తన యజమాని గురు శేఖర్, అతని స్నేహితుడు సమీర్ రాజుర్కర్ ను మహారాష్ట్రలోని కల్సుబాయి వద్ద ట్రెక్కింగ్ కోసం తీసుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. కల్సుబాయి వెళుతున్న క్రమంలో మార్గాన్ని మరచిపోవటంతో గూగుల్ మ్యాప్స్ ను అనుసరించారు. గూగుల్ వారికి కోతుల్ నుండి అకోలే కు సమీప రహదారిని చూపించింది.

చీకటిలో కనిపించకపోవటంతో డ్యాం లోకి వెళ్ళిన కారు .. ఈదుతూ బయటపడిన ఇద్దరు
చీకటిగా ఉన్న కారణంగా ఈ ముగ్గురు గూగుల్ మ్యాప్స్ చూపిస్తున్న దారిని అనుసరిస్తూ ప్రయాణం చేశారు. చివరకు అది ఒక డ్యాం లోకి దారి చూపించడంతో డ్యాం లో వాహనం పడిపోవడంతో మునిగిపోయారు.
వాహనం విండో తెరిచిన యజమాని గురు శేఖర్, అతని స్నేహితుడు సమీర్ ఈత రావడంతో బయట పడగలిగారు. పింపాల్గావ్ ఖండ్ ఆనకట్ట నుండి నీరు విడుదల కావడంతో డ్యాంలో నీళ్లు ఫుల్ గా ఉన్నాయి. దీంతో సతీష్ మృతి చెందారు.

వాహనం నడిపిన సతీష్ గులే మృతి
సతీష్ గులే మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యజమాని శేఖర్ పింప్రీ చిన్చ్వడ్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ కాగా , రాజుర్కర్ వ్యాపారవేత్త.
ఈ ఒక్క ఘటనే కాదు ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. గూగుల్ మ్యాప్ ను వినియోగించడం మంచిది అయినప్పటికీ, అనుమానం వచ్చినప్పుడు సమీపంలో ఉన్న వారిని అడగడంలో తప్పులేదు. ఒకసారి గూగుల్ మ్యాప్స్ చూపించే మార్గాలు, చాలా కన్ఫ్యూజన్ గా, దారి లేనివిగా ఉంటాయి. వాటిని గమనించి, జాగ్రత్తతో వ్యవహరించకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications