మెట్రో రైలులో ఉదయం, సాయంత్రం లోకేష్ కు అదే పని, ఎవరిని టార్గెట్ చేశాడో తెలుసా ?

ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉండటంతో ప్రయాణం చెయ్యడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకోవడానికి ప్రజలు బెంగళూరు మెట్రో రైలులో ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు ప్రయాణించడంతో మెట్రో రైలలో విపరీతమైన రద్దీ ఉంది.

నమ్మ బెంగళూరు మెట్రో రైలులో ఒంటరి మహిళను లైంగికంగా వేధించిన నిందితుడిని కెంపేగౌడ మెట్రో స్టేషన్‌లో భద్రతా అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన చోటుచేసుకుంది. అరెస్టయిన నిందితుడు లోకేష్ ఆచార్ అలియాస్ లోకేష్ అని గుర్తించామని, నిందితుడిని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

A man named Lokesh was arrested for sexually harassing women in a Bengaluru metro train
అయ్యప్ప మాలలు వేసుకుని ఐటీ హబ్ ట్రస్టు పేరుతో ఏం చేస్తున్నారంటే ?, ఫోన్ నెంబర్ తో !

ఉదయం 9.40 గంటలకు రాజాజీనగర్ మెట్రో స్టేషన్ నుంచి 22 ఏళ్ల యువతి ప్రయాణించింది. ఆ యువతి ప్రతిరోజు రోజూ రాజాజీనగర్ నుంచి ఎంజీ రోడ్డుకు మెట్రో రైలులో ప్రయాణిస్తుంది. మార్నింగ్ పీక్ అవర్ హడావిడి కావడంతో మెట్రో రైలులో ప్రయాణికులు విపరీతంగా ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న లోకేష్ అదే మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఆ యువతిని లైంగికంగా వేధించాడు. ఆమెను ఎక్కడపడితే అక్కడ తాకిన లోకేష్ అసభ్యంగా తాకి ఆమెను వేధించాడు.

రెండు మెట్రో కార్డులను ఉపయోగిస్తున్న నిందితుడు లోకేష్ సాధారణంగా రద్దీ సమయంలో మెట్రో రైలు ఎక్కి ఉదయం, సాయంత్రం వేళల్లో మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిపోయే మెట్రో ఎక్కి వాళ్లను టార్గెట్ చేసుకుంటున్నాడు. మహిళలు. కాలేజీ అమ్మాయిల వెనుక నిలబడుతున్న లోకేష్ మహిళా ప్రయాణికులను లైగింక వేధింపులకు పాల్పడుతున్నాడు. గురువారం కూడా నిందితుడు లోకేష్ అలాగే చేసాడు. అయితే ఆ యువతి వెంటనే కేకలు వేసింది.

A man named Lokesh was arrested for sexually harassing women in a Bengaluru metro train
కమల్ నాథ్ రాజీనామా ?, హైకమాండ్ ఏం చెప్పింది, ఢిల్లీలో ?, మోదీ దెబ్బకు మైండ్ బ్లాక్ !

30 ఏళ్ల లోకేష్ ఆచార్ నేలమంగళలోని ఓ వీవర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గతంలో బీఎంటీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఓ మహిళ మొబైల్‌ ఫోన్‌ లాక్కుని తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు లోకేష్ పట్టుబడ్డాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి 2023 ఏప్రిల్‌లో కేసు నమోదైంది. అయితే నిందితుడు లోకేష్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. ః

ఇప్పుడు మళ్లీ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన లోకేష్ మరోసారి బెంగళూరు పోలీసులకు చిక్కాడని అధికారులు అంటున్నారు. మొత్తం మీద నమ్మ బెంగళూరు మెట్రో రైలులో మహిళా ప్రయాణికులు టార్గెట్ చేసుకున్న లోకేష్ ను పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారని తెలిసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు లోకేష్ చరిత్ర బయటకు లాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+