వివాహేతర సంబంధం: భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది

Subscribe to Oneindia Telugu

భువనేశ్వర్‌: ఒడిషా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆగ్రహంచిన అతని భార్య.. అతని మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. ఈ మయూరభంజ్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జసిపూర్‌ బొడొసియాలిని గ్రామానికి చెందిన ప్రదీప్‌ మఝితో గత జూన్‌ 22న సాత్‌పూర్‌ గ్రామానికి చెందిన సాల్గే సొరెన్‌కు వివాహమైంది. ప్రదీప్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు భార్యకు తెలిసింది.

A woman cuts husband's penis

ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ వివాదం జరుగుతుండేది. శనివారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. సాల్గే కోపంతో భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది.

బాధితుడిని తొలుత స్థానిక ఆస్పత్రిలో, అనంతరం కేంఝర్‌ జిల్లా ప్రధాన ఆరోగ్యకేంద్రంలో చికిత్స నిమిత్తం చేర్చారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman slashed husband's penis in Odisha state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి