ఫేస్ బుక్ లైవ్ లో నరికి చంపేశాడు. కోడలు జస్ట్ మిస్, అరాచకానికి కేరాఫ్ అడ్రస్ !
జమ్మూ కాశ్మీర్: రెండు ఫ్యామిలీలు చాలా దగ్గర బంధువులు. తాతలు, ముత్తాల కాలం నుంచి రెండు కుటుంబాలు ఒకే చోట నివాసం ఉంటున్నాయి. ముత్తాతల కాలంలో, తాతల కాలంలో అందరూ కలసి ఉండటంతో ఆస్తులు ఇంకా పూర్తిగా భాగాలు కాలేదు. రెండు కుటుంబాల మధ్య ఇటీవల ఓ విషయంలో గొడవలు మొదలైనాయి. గొడవలు తారాస్థాయికి చేరాయి. రెండు కుుటంబాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. చివరికి ఓ యువకుడు అతని బంధువును ఫేస్ బుక్ లైవ్ లో హత్య చెయ్యడం కలకలం రేపింది.
జమ్మూ కాశ్మీర్‌లో ఓ వ్యక్తి ఆస్తి తగాదాల కారణంగా తన బంధువును దారుణంగా హత్య చేసి ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. భైరవ్ సింగ్ (34) అనే యువకుడు జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలో నివాసం ఉంటున్నాడు. భైరవ్ సింగ్ కు అదే ప్రాంతంలో నివసించే రామకృష్ణకు (వరుసకు పెద్ద నాన్న అవుతాడు) చాలా కాలంగా ఆస్తుల పంపకాల విషయంలో శత్రుత్వం ఉంది.

ఆస్తి పంపకాల విషయంలో ఇరు కుటుంబాల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో జూన్ 16వ తేదీన పొలం భూమి వివాదంపై ఇరు కుటుంబాలు మాట్లాడుకోవడం జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ఇరు కుటుంబ సభ్యులు కొట్టుకుని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. వివాదాస్పద స్థలంలో పాతి పెట్టిన సరిహద్దు రాళ్లను తొలగించి ఈ భూమి మాదే అంటే కాదు మాదే అంటూ గొడవలు పడ్డారు.
ఆ సందర్బంలో భైరవ్ సింగ్ అతని మొబైల్ ఫోన్ లో ఫేస్ బుక్ లైవ్ లో ఆ గొడవను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాడు. తరువాత మొబైల్ ఒక చోట పెట్టిన భైరవ్ సింగ్ రెచ్చిపోయాడు. తరువాత భైరవ్ సింగ్, రామ్ కృష్ణల మధ్య గొడవ పెద్దది అయ్యింది. ఆ గొడవ ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందోని అందరూ మరిచిపోయారు. భైరవ్ సింగ్, రామ్ కృష్ణల కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు.

ఈ ఘటనలన్నీ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. ఆ సమయంలో హఠాత్తుగా భైరవ్ సింగ్ అతని దగ్గర ఉన్న గొడ్డలితో రామకృష్ణను నరికేశాడు. తీవ్రగాయాలైన రామకృష్ణ ప్రాణాలు స్పాట్ లో గాలిలో కలిసిపోయాయి. భైవర్ సింగ్ దాడిలో రామ్ కృష్ణ కోడలు అంజు దేవి కూడా గాయపడింది. మామ రామకృష్ణను రక్షించడానికి వెళ్లిన అంజు దేవికి తీవ్రగాయాలు కావడంతో ఆమె కుప్పకూలిపోయింది. హంతకుడు భైరవ్ సింగ్ అక్కడి నుంచి తప్పించుకి అడవిలోకి పారిపోయాడు. చుట్టుపక్కలవారు అంజు దేవిని రక్షించి ఆసుపత్రిలో చేర్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రామకృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అడవిలో దాక్కున్న భైరవ్‌సింగ్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని భైరవ్ సింగ్ నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తన తండ్రిని హత్య చేసిన భైరవ్ సింగ్‌ను కఠినంగా శిక్షించాలని మృతుడు రామకృష్ణ కుమారుడు రాఘవ డిమాండ్ చేశారు. మొత్తం మీద ఫేస్ బుక్ లైవ్ లో సమీప బంధువును ఓ యువకుడు హత్య చెయ్యడం జమ్మూ కాశ్మీర్ లో కలకలం రేపింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications