వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఆధార్ ను లింకు చేయకపోతే బ్యాంకు అకౌంట్ క్లోజ్

అన్నింటికీ ఆధార్ ను తప్పనిసరి చేస్తూ వెళ్ళున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. బ్యాంకు ఖాతాలను తెరిచేందుకుగాను ఆధార్ ను తప్పనిసరిచేస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్నింటికీ ఆధార్ ను తప్పనిసరి చేస్తూ వెళ్ళున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. బ్యాంకు ఖాతాలను తెరిచేందుకుగాను ఆధార్ ను తప్పనిసరిచేస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకొంది.

రూ.50 వేలు, ఆపై ఆర్థిక లావాదేవీ ప్రతిదానికి ఆధార్ ను తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రస్తుతమున్న బ్యాంకు అకౌంట్ ఖాతాదారులంతా 2017 డిసెంబర్ 31 వరకు ఆధార్ ను బ్యాంకుల్లో సమర్పించాలని , లేని పక్షంలో ఆ అకౌంట్లు చెల్లనివిగా మారుతాయని కేంద్రం హెచ్చరించింది.

Aadhaar mandatory for opening bank account

పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్ కు ఆధార్ ను అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేయడాన్ని పలుమార్లు విచారించిన అనంతరం గత వారమే సుప్రీంకోర్టు దీన్ని సమర్థిస్తున్నట్టు పేర్కొంది.

అయితే ఎవరైతే ఈ యూనిక్ ఐడీని కలిగి ఉంటారో వారు పాన్ కార్డుకు దాన్ని లింక్ చేసుకోవాలని ,ఆధార్ కార్డు లేని వారి విషయంలో దీన్ని పట్టుబట్టరాదని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.అయితే వెను వెంటనే ఆధార్ కార్డు తప్పనిసరైతే మరో కొత్త ఆదేశాలను కేంద్రం జారీ చేసింది.

English summary
In a fresh development, Government has made Aadhaar mandatory for opening a bank account. It has also made it mandatory for financial transactions of Rs 50,000 and above. All the existing account holders have been asked to submit Aadhaar to banks by December 31, 2017, failing which accounts will become invalid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X