వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంత్‌, యోగేంద్రలపై ఆప్ వేటు: పంచాయతీ పాలనన్న నేతలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అసమ్మతి నేతలు ప్రశాంత్‌భూషణ్‌, యోగేంద్రయాదవ్‌లపై బహిష్కరణ వేటు పడింది. వీరితోపాటు మరో ఇద్దరు నేతలు ఆనంద్‌కుమార్, అజిత్‌ఝాలనూ పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆప్ క్రమశిక్షణ కమిటీ సోమవారం రాత్రి నిర్ణయం తీసుకుంది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను జారీచేసిన షోకాజ్ నోటీసుకు సోమవారం వారిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని, పార్టీ నియమావళిని ఉల్లంఘించినందుకుగాను వారిని పార్టీ నుంచి బహిష్కరించామని ఆప్ అధికార ప్రతినిధి దీపక్‌ బాజ్‌పాయ్ తెలిపారు.

కాగా, అంతకుముందు షోకాజ్ నోటీసుపై యోగేంద్రయాదవ్, ప్రశాంత్‌భూషణ్‌లు తీవ్రంగా స్పందించారు. క్రమశిక్షణ కమిటీయే అక్రమమని యోగేంద్ర అన్నారు. ప్రశాంత్ భూషణ్ స్పంది స్తూ.. క్రమశిక్షణ కమిటీలోని ఇద్దరు సభ్యులు అవినీతిపరులేనని ఆరోపించారు

 AAP expels Yogendra Yadav, Prashant Bhushan

ఆప్‌లో గ్రామ పంచాయితీ(కాప్ పంచాయితీ) తరహా రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. పార్టీయే జడ్జిగా వ్యవహరించడం ఎంతవరకు న్యాయమని యోగేంద్ర యాదవ్‌ ప్రశ్నించారు. కమిటీ ఏ కారణాల చేత నిర్ణయం తీసుకుందో తనకు తెలియదని అన్నారు. పార్టీ విలువలను, పార్టీ ఆత్మను కొందరు నాశనం చేస్తున్నారని మరోనేత ప్రశాంత్‌ భూషణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ ఆత్మనే త్యాగం చేసినవాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా.. తమను వెలివేయడం ఎంత వరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్‌ ఒక గ్రామ పంచాయితీ మారిందని, ఆ పంచాయతీకి ఓ తానేషా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆయన అదేశాలనే మిగితావాళ్లు పాటిస్తున్నారని ప్రశాంత్‌ ఆరోపించారు.

English summary
Rebel leaders Yogendra Yadav and Prashant Bhushan were on Monday expelled from the Aam Aadmi Party. Along with the two founding members, senior leaders Anand Kumar and Ajit Jha have also been expelled by AAP’s national disciplinary action committee which found all four guilty of anti-party activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X