నటి లైంగిక దాడి కేసు: మలయాళం హీరో దిలీప్ జ్యుడిషియల్ కస్టడీ పొడగింపు, ఇక అంతే !

Posted By:
Subscribe to Oneindia Telugu

కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ ఆగస్టు 22వ తేదీ వరకు జైలుకే పరిమితం అయ్యాడు. మంగళవారం కేరళలోని అంగమాలి మెజిస్ట్రేట్ కోర్టు దిలీప్ జ్యుడీషియల్ కస్టడీ ఆగస్టు 22వ తేదీ వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

గత ఫిబ్రవరి 17వ తేదీన ప్రముఖ నటి షూటింగ్ ముగించుకుని కారులో ఇంటికి వెలుతున్న సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి రెండు గంటల పాటు వేగంగా వెలుతున్న కారులోనే లైంగిక దాడి చేశారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.

Actress assault case: Malayalam actor Dileep’s judicial custody extended till Aug 22

కేసు విచారణ చేసిన పోలీసులు నటి లైంగిక దాడి కేసులో ప్రధాన సూత్రదారులైన సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ, విగ్నేష్ అనే నిందితులను అరెస్టు చేశారు. నటి మీద లైంగిక దాడి చేసే సమయంలో మొబైల్ లో వీడియో తీశారని పోలీసులు గుర్తించారు.

అయితే ఇప్పటి వరకు ఆ వీడియో ఉన్న మెమొరీ కార్డు మాత్రం పోలీసుల చేతికి చిక్కలేదు. పల్సర్ సునీ నోరు విప్పడంతో ప్రముఖ మలయాళం నటుడు దిలీప్ (ఈ కేసులో కింగ్ పిన్)ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణ అనంతరం దిలీప్ ను ఆలువా సబ్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా దిలీప్ ఆలువా సబ్ జైల్లోనే ఉన్నాడు. ఆగస్టు 15వ తేదీన సాటి ఖైదీలతో దిలీప్ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గోనాల్సి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kerala Angamali magisterial court on Tuesday extended the judicial custody of actor Dileep till August 22, in connection with assault and abduction of a Malayalam actress.
Please Wait while comments are loading...