Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో చైనా మహమ్మారి ? కేంద్రం హెచ్చరికలతో ఆరు రాష్ట్రాల్లో అలర్ట్ ..

చైనాలో పుట్టిన కోవిడ్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా రేపిన కల్లోలం మర్చిపోకముందే ఇప్పుడు మరోసారి డ్రాగన్ దేశం నుంచి మరిన్ని శ్వాస సంబంధిత వైరస్ లు మన దేశంపై దాడికి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆరు రాష్ట్రాలకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. వాటి లక్షణాలతో పాటు తీసుకోవాల్సిన చర్యల్ని సూచిస్తోంది.

చైనాలో చిన్నారుల్లో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ లోనూ ఆరు రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఇందులో వైద్య సదుపాయాల సంసిద్ధతను సమీక్షించాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది. ఇందులో రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు ఉన్నాయి. కేంద్రం హెచ్చరికలతో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు శ్వాసకోశ సమస్యలపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి సిద్ధంగా ఉండాలని ఆస్పత్రులు, వైద్య సిబ్బందిని ఆదేశించాయి.

after centres advisory six states on alert over china respiratory infections

దీంతో పాటు సీజనల్ ఫ్లూ పట్ల కూడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ఆరోగ్య శాఖ తమ అధికారుల్ని కోరింది. కాలానుగుణ ఫ్లూ యొక్క లక్షణాలు, ప్రమాద కారకాలను ప్రకటించింది. అలాగే ప్రజలు చేయాల్సిన పనులు, చేయకగూడదని పనుల్ని కూడా ప్రకటించింది. దగ్గు లేదా తుమ్మేటప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం, తరచుగా చేతులు కడుక్కోవడం, ముఖాన్ని తాకకుండా ఉండటం, రద్దీ ప్రదేశాలలో మాస్క్‌లను ఉపయోగించడం వంటివి ఇందులో ఉన్నాయి.

అటు రాజస్థాన్ ఆరోగ్య శాఖ జారీ చేసిన సూచనల్లో పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా లేదని, అయితే వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరింది. అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించాలని, పీడియాట్రిక్ యూనిట్లు, మెడిసిన్ విభాగాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. గుజరాత్‌లోనూ కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను చైనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా బలోపేతం చేస్తున్నారు.

ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడులోలోనూ ప్రభుత్వాలు తమ ఆరోగ్ శాఖల్ని, అధికారుల్ని అలర్ట్ చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్ని కూడా ఎలాంటి అత్యవసర పరిస్దితిని అయినా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాయి.
ఏదైనా అత్యవసర పరిస్ధితి వస్తే ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలన్న కేంద్రం సూచనలకు అనుగుణంగా అలర్ట్ లు జారీ చేస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో చేపట్టిన చర్యల తరహాలో ఏర్పాట్లు ఉండాలని కోరుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+