మళ్లీ సుప్రీంకోర్టు ఫైర్-వెనక్కి తగ్గిన కేంద్రం-ఆ ఐదు పేర్లకు త్వరలో మోక్షం..

సుప్రీంకోర్టు కొలీజియం పంపిన ఐదుగురు జడ్డీల పేర్లను ఆమోదించకుండా జాప్యం చేస్తున్న కేంద్రంపై అత్యున్నత న్యాయస్ధానం ఇవాళ మళ్లీ సీరియస్ అయింది. దీంతో త్వరలోనే ఆమోదిస్తామని హామీ ఇచ్చింది.

సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించిన ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తుల పేర్లకు కేంద్రం ఆమోదం తెలపకుండా అసాధారణ జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు ఇవాళ మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన విషయమని సుప్రీం ధర్మాసనం కన్నెర్ర చేసింది. దీంతో కేంద్రం దిగొచ్చింది.

సుప్రీంకోర్టులో ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫారసులను త్వరలోనే ఆమోదించి పంపుతామని కేంద్రం ఇవాళ మరోసారి సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సంబంధించిన తన సిఫార్సులను ఆమోదించడంలో కేంద్రం తీవ్ర జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన సమస్య అని పేర్కొంది. దీంతో కేంద్రం ఇరుకునపడింది.

after supreme courts latest anger, centre assures to clear collegium recommendations

సుప్రీంకోర్టులో 34 మంది జడ్డీల్ని నియమించేందుకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం 27 మందితోనే పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 13న ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికార్ల పేర్లను సుప్రీంకోర్టు జడ్డీలుగా ఆమోదించాలని కోరుతూ సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. అయితే కేంద్రం మాత్రం దీన్ని ఆమోదించేందుకు సిద్ధంగా లేదు. దీంతో అసాధారణంగా జాప్యం చేస్తూ వస్తోంది. దీనిపై సుప్రీంకోర్టు గుర్రుగా ఉంది

ఈ ఐదుగురు జడ్డీల్లో పాట్నా హైకోర్టుకు చెందిన జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్, అలహాబాద్ హైకోర్టుకు చెందిన మిశ్రా, రాజస్థాన్ హైకోర్టుకు చెందిన జస్టిస్ పంకజ్ మిథాల్, పాట్నా హైకోర్టుకు చెందిన జస్టిస్ సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ ఉన్నారు. ఈ న్యాయమూర్తుల నియామకంలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన ఐదు సిఫార్సులను త్వరలోనే ఆమోదిస్తామని ప్రభుత్వం మరోసారి హామీ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+